పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. పనిచేసే గుణం అలవర్చుకోవాలి

       పనిచేయందే విజయం లేదు. పని వల్ల సంపద పెరుగుతుంది. అభివృద్ది చేకూరుతుంది. పనిని గూర్చి కొన్ని ముఖ్యసూత్రాలు గమనిద్దాం.

1. పని చేసే వాళ్లంగా వుండాలి

    నరులు రెండు రకాలుగా వుంటారు. కొందరు పనిచేసి చూపిస్తారు. వీళ్లు విజయాలు సాధిస్తారు. కొందరు పనెచేసి వూరుకోరు. వెలుపలికి పనిచేసేవాళ్లలాగ మాట్లాడతారు. పని మాత్రం జరగదు.  వీళ్లు విజయాలు సాధించరు.
  పైయధికారులు మనకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు ప్రధానంగా కోరుకొనేది మనం సంతృప్తికరంగా పనిచేయాలనే ఉద్యోగి సరిగా పని చేయకపోతే యజమానుడు అతని పట్ల గౌరవమూ ఇష్టమూ చూపడు.
   నరులకు గొప్ప ఆలోచనలు వుంటేనే సరిపోదు. వాటికి తగినట్లుగా క్రియలు కూడచేసి చూపించాలి. పెద్ద పెద్ద ఆలోచనలుండి పనికి పూనుకోని వానికంటే ఒకపాటి ఆలోచనలుండి వాటిని ఆచరణలో పెట్టేవారు వందరెట్లు మెరుగు.
   పనులు చేసేవాళ్ల లక్షణం వెంటనే పనికి పూనుకోవడం వీళ్లు ఎక్కువగా మాట్లాడరు. ఎంత పనిచేయాలి ఎప్పుడు ప్రారంభించాలి. ఎప్పుడు ముగించాలి అని అన్నీ ముందుగానే ఆలోచిస్తారు. పని చేయనివాళ్ల లక్షణం వాయిదాలు వేయడం. వీళ్లు మాటలు బాగా చెప్తారు. ఒక కార్యాన్ని సాదించడం ఎంత కష్టమో వివరించి చెప్తారు. సాకులు వెదకుతారు. పని మాత్రం జరగదు. సోమరులుగా ఉండిపోతారు.

2.అనుకూలమైన పరిస్ధితులకొరకు వేచివుండ కూడదు

    కొంతమంది మీరు పని ఎందుకు ప్రారంభించలేదు అని అడిగితే పరిస్దితులు అనుకూలంగా లేవని చెప్తారు. పరిస్దితులు పరిసరాలు అన్నివిధాల అనుకూలంగా ఎప్పుడూ వుండవు. వాటి పద్దతిలో అవి వుంటాయి కనుక