పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుకూలమైన పరిస్దితుల కొరకు కాచుకొని వుంటే నష్టపోతాం.

    మనం ఏపని తలబెట్టినా సమస్య్తలూ, ప్రమాదాలూ అనిశ్చిత పరిస్దితులూ తప్పక వుంటాయి. అసలు అడ్డంకులు లేని పని యేదీ వుండదు. వాతావరణం అనుకూలించకపోవడం, ప్రక్కవాళ్లు సహకరించక పోవడం - ఈలా అవరోధాలు కొల్లలుగా వుంటాయి కనుకిఅ అడ్డంకులు తొలగిపోయే దాక ఆగడం మంచిపద్దతి కాదు.
    ఇంకో విషయం గూడ, విజేత అడ్డంకులన్నీ ముందుగానే తొలగించుకోనక్కరలేదు. అసలు మనం ప్రారంబించబోయే ఏయే అడ్డంకులున్నాయో ముందుగా ఊహించలేం గదా! కాని అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొని పరిష్కరించుకొనే సామర్ధ్యం మాత్రం విజేతకు వుండాలి. మామూలుగా ఆ శక్తి చాలవరకు అందరికీ వుంటుంది. కనుక అవరోధాలు వుంటాయని భయపడి పనిని వాయిదా వేసికొంటూ పోకూడదు.

3. కేవలం ఆలోచనలవల్లనే విజయం సిద్దించదు

    ఏ కార్యాన్ని సాధించడానికయినా ముందుగా జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళిక వేసుకోవాలి. సాధ్యాసాధ్యాలు విచారించాలి. లాభ నష్టాలు పరిశీలించాలి కాని కేవలం ఆలోచన వల్లనే విజయం సిద్దించదు. పని చేస్తేనే విజయం. వంద ఆలోచనలుండి పనికి పూనుకోని వానికంటే కొద్దిపాటి ఆలోచనలతోనే పనికి పూనుకొనేవారు ఎక్కువ విజయాలు సాధిస్తారు.
     ఆలోచనలు ఉండి కూడ పనిని ప్రారంభించని వారు తర్వాత బాధపడతారు. నేను ఆ పనిని అప్పుడే చేసివున్నట్లయితే బాగుండేది అని విచారిస్తారు. ఈ విచారానికి గురికాకుండా వుండాలంటే ముందుగానే పనికి పూనుకొవాలి.
     కొందరికి ఏదైనా పని చేయాలంటే వల్లమాలిన భయం ఫలానా చోటికి పోవాలన్నా, ఫలానా వ్యక్తిని కలవాలన్నా పదిమంది ముందు ఉపన్యాసము ఈయాలన్నా బెదురుతారు. ఆ భయంతో ఆ కార్యాన్ని అలాగే వాయిదా వేస్తుంటారు.