పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈలాంటి భయాన్ని జయించే మార్గం ఒకటుంది. ఏదంటే మనకు భయమోదాన్ని చేయడానికి పూనుకొవాలి. అప్పుడు ఆ భయం పొతుంది. ఉదాహరణకు ఫలానా వ్యక్తిని కలవాలంటే మనకు భయం అనుకొందాం ధైర్యంచేసి ఆ వ్యక్తిదగ్గరికి వెళ్లాలి. అలా వళ్లగానే ఆ భయం తొలగి పోతుంది. అసలా వ్యక్తి మనం అంకొన్నంతా మనలనుయ్ వ్యతిరేకించేవారు కాదని గుర్తిస్తాం. మనకు లాగే ఇతరులు కూడ భయాలూ బలహీనతలూ వుంటాయని అర్ధం చేసుకోవాలి.

4. పనికి ప్రేరణం కలిగిందాకా ఆగకూడదు

   కొంతమంది ప్రేరణం కలిగినప్పుడు పని ప్రారంభిద్దాం అనుకొంటారు. కొన్నిసార్లు ఆ ప్రేరణ వస్తుంది. కొన్నిసారులు రాదు. కనుక స్పందన కొరకు ఆగకూడదు స్పందన రాకపోయినా పని మొదలుపెట్ట వలసిందే యాంత్రికంగా మొదలుపెట్టి పనిచేస్తుంటే కొంతసేపటికి స్పూర్తి దానాంతట అదే వస్తుంది. మనం రోజూ వాడే యంత్రాలు మొదట మెల్లగా కదులుతాయిల్. త్సర్వాత గిరగిరా తిరుగుతాయి. అసలు కదిలించకపోతే యంత్రం ఎప్పటికీ కదలదు. స్పూర్తిని మనమే కదిలించాలి. అది కదిలిందాకా ఆగకూడదు. మనలను మనమే ప్రొత్సహించుకొవాలి ఉత్తేజపరచుకోవాలి.
   కొన్నిసార్లు మనకు ఇష్టంలేని పనులు ఛేయవలసి వుంటుంది. చేయబుద్దికాదు. కనుక వాటిని అలాగే వాయిదా వేస్తుంటాం  ఈలా చేయకూడదు. ఇష్టమున్నా లేకపోయినా యాంత్రికంగా వాటిని చేయడానికి పూనుకొవాలి. అప్పుడు గాని అ పనులు జరగవు. మనలోని శక్తి మనలను కదలించిందాకా ఆగకూడదు. ఆ శక్తిని మనమే కదిలించాలి గొప్ప రచయితలు ప్రేరణం వచ్చిందాకా ఆగరు. కాగితమూ కలమూ తీసుకొని వ్రాస్తుంటే కొంతసేపటికి ప్రేరణం దానంతట అదే వస్తుంది. ఒకసాది కదలికను ప్రారంభిస్తే ఆ మీదట అదే కొనసాగుతుంది.

5."తర్వాత"కు బదులుగా "ఇప్పుడు" అనుకోవాలి

   చాల పర్యాయాలు ఒకపని చేద్దామనుకొంటాం. మళ్లా తర్వాత చేద్దాములే