పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుకొంటాం ఇక ఆ పని రోజురోజుకీ వాయిదా పడుతుంటే కాని జరగదు. ఆ పనిని ఇప్పుడే చేద్దాం అనుకొంటే వెంటనే జరుగుతుంది.

   ఇప్పుడే చేద్దామనే సూత్రాన్ని బాగా వంట పట్టించుకోవాలి. చాలమంది డబ్బు ఆదా చేద్ధాం అనుకొంటారు. కాని ఆ దాను ఎప్పుడు చేయాలి? నిజంగా అదా చేసేవాళ్లు కొద్దిమందే వాళ్లు ఇప్పుడే అనే సూత్రాన్ని పాటించిన వాళ్లు మిగిలినగారి ఆదా మాత్రం కేవలం ఆలోచనల్లోనే వుండిపోయింది. స్నేహితునికి ఉత్తరం వ్రాద్దామనుకొంటే వెంటనే వ్రాయాలి. తర్వాత వ్రాధ్దాములే అనుకొంటే ఆ పని రోజు రొజికి వాయిదా పడుతుంది. గుర్తుంచుకోండి "ఇప్పుడు" అనేది పని నెరవేరడానికి ఉపయోగించే మంచి సూత్రం తరచుగా విద్యార్ధులు హోంవర్కు తర్వాత చేద్దాములే, పాఠం తర్వాత చదువుదాంలే అనుకొంటారు. అలా అనుకొని ఆటపాటల్లోనే టీవీ చూడ్డంలోనో, ముచ్చట్లలోనో పడిపోతారు ఇమ మొదట అనుకొన్న పని జరగనే జరగదు. తర్వాత చేద్దాం అనుకోవడం వల్లనే చాల పనులు క్రియారూపం పొందడంలేదు. తర్వాత అనేది సొమరిపోతుల ఆయుధం పనికి శత్రువు.

6. సిద్ధం కవడానికి కాలాన్ని విచ్చించకూడదు

     కొంతమంది చేద్ధామనుకొన్న పనిని వెంటనే ప్రారంభించరు. ఒక పనికి పూనుకొందామనుకొంటూనే ఏవేవో చిల్లరమల్లర పనుల్లో పడిపొతారు. తాము పాఠం చదువుదామనుకొని కూడా కాసేపు బల్ల తుడుస్తారు. పుస్తకాలు సర్దుతారు. పెన్సిలు చెక్కుతారు బట్టలు సర్దుతారు పాఠం మాత్రం మొదలు పెట్టరు. ఈలా జాప్యం చేయ్లకూడదు. చేయాలనుకొన్నపనిని వెంటనే చేయడానికి పూనుకోవాలి. విశేషంగా ఇష్టంగాని పనులు చేయవలసి వచ్చినపుడు వెంటనే ప్రారంభించాలి చాలామందికి పని అనిష్టంగానే వుంటుంది. అంతమాత్రం చేతనే దాన్ని ప్రక్కన పెట్టకూడదు.

7.చొరవ వుండాలి

  పని చేయడానికి బాగా ఉపయోగించే ఒక సూత్రం కార్యారంభశక్తి