పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీన్ని ఇంగ్లీషులోఇనీషీయేషన్ అంటారు. పై వాళ్ల చేత చెప్ప్ంచుకొకుండ మనంతట మనం పూనుకోవాలి. ఈ గుణం కలవాళ్లే నాయకులయ్యేది. గాంధి ఎవరు చేస్తే స్వాతంత్ర్య సాధనకు పూనుకొన్నారు? మదర్ తెరేసా ఎవరు చేస్తే దీనులకు సేవలు చేసింది? రాజా రామమోహన్ రాయ్ ఎవరు చేస్తే సతీ దురాచారాన్ని మాన్పించారు? నాయకులు ఒకరిచేత చెప్పించుకోరు. వాళ్లంతట వాళ్లే పనికిపూనుకొంటారు. రైలింజూను దానంతట అదేకదులుతింది. రైలిపెట్టె ఇంజను మాత్రమే కదులుతుంది. నరులు రైలుపెట్టెలా వుండకూడదు. విద్యార్ధులు చిన్ననాటినుంచే స్వయంప్రేరణతొ పనిచేసే గుణాన్ని అలవర్చుకోవాలి. స్వచ్చంద సేవకులు వాళ్లంతట వాళ్లే ముందుకి వచ్చి పని చేస్తారు. విద్యార్దికి ఈ గుణం వుండాలి చొరవ కలవాళ్లు తమంతటతామే పనికి పూనుకొనేవాళ్లు తప్పక విజయాలు సాదిస్తారు. తాము కోరుకున్న గమ్యాన్ని చేరి తీరతారు. దురదృష్టవశాత్తు నేడు మనదేశంలొ చాలామందిలో ఈ గుణం కనిపించదు. విద్యార్ధిపని విద్యను ఆర్జించడం ఆ పని అతడు ఒకరిచేత చెప్పించుకొకుండానే చేయాలి.

4.విజయసాధకుల లక్షణాలు

   జీవితం మనమే స్వయంగా మలచుకొనేది మనం దాన్ని సార్ధకమైనా చేసికొవచు లేక నిరర్ధకమైనా చేసికొవచ్చు. కొందరుల్ కర్మవాదాన్ని నమ్మి వెలుపలి శక్తులు తమ్ము నడిపిస్తాయి అనుకొంటారు. పనికి పూనుకోరు.  వీళ్లు జీవితాలు సార్ధకం జేసికొకోరు. దీనికి భిన్నంగా కొందరుల్ నా జీవితాన్ని నేనే నడిపించుకొంటాను అనుకొంటారు. 'వీళ్లు విజయాలు సాధిస్తారు. విజేతలంతా శ్రమ శక్తిని నమ్ముతారు. నేనీకార్యాన్ని చేయగలను అనుకొంటారు.  వీరికి ఆత్మవిశ్వాసమూ వుత్సాహమూ, పనిని కొనసగించుకొనిపొయే గుణమూ వుంటాయి. విజయాలు సాదించిన వాళ్లలో కొన్ని ముఖ్య లక్షణాలు కన్పిస్తాయి. మనం కూడ ఈగుణాలను అలవర్చుకొవచ్చు