పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1. చొరవచూపడం, పనులు జరిగించడం

      విజేతలకు చొరవ వుంటుంది. ఒకరిచేత మెప్పించు కోకుండ తమంతట తామే పనులు ప్రారంబిస్తారు. వీళ్లు కార్యాలు జరుగుతూంటే వట్టినే చూస్తూ వుండిపోరు. వాటిని స్వయంగా జరిగిస్తారు. క్రియాపరులుగాల్ వుంటారు. సమస్యలను ముందుగానే పసికట్టి విచరాణ మార్గాలను వెదుకుతారు. ఆవేశంతో గాక ఆలోచించి పనులు చేపడతారు. వీళ్లకు తమ శక్తులూ లోపాలు కూడ బాగా తెలుసు. తమ ఆలోచనలు పనులు సరైనవేనాఅని యెప్పటికప్పుడు పరిశీలించి చూచుకొంటారు. అడ్డంకులు ఎదురైనప్పుడు క్రొత్త మార్గాలు తొక్కుతారు. వీరికి నేనీ కార్యాన్ని సాదించగలను అనే నమ్మకమూ ధైర్యమూ బలంగా వుంటాయి.
    క్రియాపరులు కానివారి ప్రవర్తనం కేవలం దీనికి భిన్నంగా వుంటుంది. వీళ్లు సాదించేది విజయాలు కాదు. అపజయాలు తమ అపజయాలకు ఇతరులు కారణమని చెప్తుంటారు. వేసవిలో వేడిగా వుందనీ, చలికాలంలో చలిగావుందనీ వానకాలంలో వానకురుస్తుదనీ సాకులు చెప్పి పనికి పూనుకోరు. తమ పేదరికానికి కర్మో విధో కారణమని చెప్తారు. తాము వెనుకబడి వుండడానికి తల్లిదండ్రులో వుపాధ్యాయులో మరొకరో కారణమని వాదిస్తారు. ఎప్పుడూ సణుతూ ఫిర్యాదులు చేస్తూవుంటారు. కాని ఆ తరుణం ఎప్పటికీ రాదు. మీరెందుకు విజయాలు సాధించలేదని ఎవరైనా నిలదీసి అడిగితే కోపాన్ని ప్రదర్శిస్తారు. ఈ బాపతు జనం ముఖ్యమైన పనులకు పూనుకోరు. ఏవో అనవసరమైన చిల్లరమలర పనుల్లో పడతారు. అందుచే ముఖ్యమైన వాటిని సాధించరు.
   మనం విజయాలు సాధించి విజేతలు కావాలంటే మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. పరిస్తితులు అనుకూలంగా లేనప్పుడు కూడ పట్టుదలతో ధైర్యంతో పనిచేయాలి. అసాధ్యమైన దానికి ప్రాకులాడనక్కరలేదు. కాని విషమ పరిస్దితుల్లో కూడ మనం చేయగలిగిన దానిని చేసి తీరాలి. పట్టుదలతో పనికి