పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూపుకోవడం, స్వయంగా పనులు జరిగించడం ముఖ్యం చర్యగా ఆలోచించి ప్రణాళికలు వేసికొని చొరవ చూపించడం ప్రధానం. నిష్క్రియాపరులమైతే తప్పక వొడిపొతాం. క్రియాపరులను గెలుపు వరిస్తుంది.

2. లక్ష్ల్యం వుండాలి

    చాలమందికి భవిష్యత్తులో ఏమి సాధించాలొ తెలియదు. వట్టినే కాలం వెళ్లబుచ్చుతుంటారు. జీవితానికి లక్ష్యం వుండాలి ఏ వృత్తిలో ప్రవేశించాలో, ఏమి సాధించాలోచిన్నప్పుడే నిర్ణయంచుకోవాలి. ఇదే లక్ష్యం. లక్ష్యసాధనకు దీర్ఘకాలిక ప్రణాలికలూ ప్రస్తుత ప్రణాలికలూ కూడ సిద్ధం చేసుకొవాలి.
  లక్ష్యమూ ప్రణాళికలూ లేనివాళ్లకు జీవితం అర్ధవంతంగా వుండదు. కబుర్లు చెప్పుకొంటూనో, వీధుల వెంట తిరుగుతూనో టీవిలు చూస్తూనో కాలక్షెపం చేస్తుంటారు. సొమరితనంగా వుండిపొతారు. అమూల్యమైన కాలాన్ని దుర్వినియొగం చేస్తారు.
   భవనాలు కట్టేవాళ్లూ, గ్రంధాలు వ్రాసేవాళ్లూ ముందుగానే ప్లాను వేసికొంటారు. రైతులు వానకాలం రాకమునుపే ఏ పొలంలో ఏ పైరు  వేయాలో ముందుగానే నిర్ణయించుకొంటారు.  ఈలాగే మన భవిష్యత్తుకు కూడ మనకు పధకంవుండాలి. అదే లక్ష్యం లక్ష్యంగల వాళ్లు క్రియాశీలురుగా, చురుకుగా వుంటారు. కక్ష్యంలెనివాళ్లు సొమరులుగా వుంటారు. అల్లరిచిల్లర పనుల్లో పదిపోతారు.
     ఈ లక్ష్యం మరీ వున్నతమైనదిగా వుండిపోకూడదు. దాన్నిసాధించలేం మరీ తేలిపాటిదిగా వుండి పోకూడదు. మరీ సులువైనదైతే అది మనలను సవాలు చేయెలేదు. దాన్ని సాధించడంలో విసుగుపుట్టి మధ్యలోనే వదలివేస్తాం కనుక లక్ష్యం ఎప్పుడూ కొంచం ఉన్నతమైనది కష్టమైనదిగా వుండాలి అప్పుడేగాని సవాలు ఎదురై మనలోని శక్తులు వెలుపలికి రావు.
    లక్ష్యాలనూ ప్రణాళికలనూ ఏర్పరచుకొన్నంత మాత్రాన్నే విజయాన్ని చేజిక్కించుకొలేం. పనికి పూనుకొవాలి. పట్టుదలతో ఆ పనిని కొనసాగించాలి.