పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆటంకాలకు దడవకూడదు. ధైర్యం గా ముందడుగు వేయాలి. కొంతకాలమయ్యాక వుత్సాహాన్ని కొల్పోయి కార్యాన్ని మధ్యలోనే వదలివేయకూడదు. ఎంతకాలానికి లక్ష్యాన్నిసాధించాలోగూడ ముందుగానే నిర్ణయించుకోవాలి. విజయాలను సాధించడం ఎంతమాత్రం సులభం కాదు. వాటిని సాధించేవాళ్లు కొద్దిమందే.

3. ముఖ్యమైనవాటికి ప్రాముఖ్యమీయాలి

   భగవంతుడు అందరికి ఖచ్చితంగా రోజుకి 245 గంటలు కాలమే యిస్తారు. ఎక్కువాలేదు తక్కువాలేదు. ఆ నియమిత కాలంలోనే కొందరు విజయాలు సాధిస్తారు. కొంతమంది సాధించలేరు. వ్యత్యాసం ఇక్కడే వుంది కాలాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి.
  కొంతమంది ఎప్పటి పనులు అప్పుడే చేసి ముగించరు. సొమరితనంతో వాయిదా వేస్తారుల్. చివరన గడువు సమీపించడంతో వాటిని త్వరత్వరగా అజాగ్రత్తగా చేసి ముగించబోతారు,. పైయదికారిచే చీవాట్లు  తింటారు. పనులు వాయిదా వేసేవాళ్లు లక్ష్యాన్ని సాధించలేరు.
   మనకు శారీరక, మానసిక, సాంఘిక అధ్యాత్మిక అవసరాలు వుంటాయి.  వీటన్నిటినీ సమపాళ్లలో తీర్చుకోవాలి. దేవి ప్రాముఖ్యం దానిదే. జీవితంలో సమతౌల్యాన్ని సాధించాలి లేకపోతే చిక్కులొస్తాయి.
    కొందరు అత్యావశ్యకమైన పనులకు ప్రాముఖ్య మిచ్చి అవసరమైన పనులను ప్రక్కన బెడతారు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. అవసరమైన పనులను ముందుగానే గుర్తించి పూర్తిచేసు కోవాలి.
  పద్దలు అతి సర్వత్ర వర్గయేత్ అన్నారు. దేనిలోను మితం మీరకూడదు. భోజనం, కబుర్లు, టి.వి. సెల్పోన్లు, నిద్ర మొదలైన వాటిల్లో మితాన్ని పాటించకపోతే తిప్పలు తెచ్చుకొంటాం. కొన్ని పనులు అపాయాలు ప్రమాదాలతో కూడి వుంటాయి. చాలమంది వీటికి దూరంగా వుంటారు. అనుకూలంగా భద్రంగా వుండేపనులు మాత్రమే చేపడతారు.  కాని కొన్నిసార్లు అపాయకరమైన