పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పనులు కూడ మన లక్ష్యానికి సంబందించినవైవుండవచ్చు లక్ష్యసాధన కొరకు హానికరమైన కార్యాలను గూడ చేపట్టాలే గాని వదలివేయకూడదు.

     వివేకంగలవారు ఏ పనికి ఎంత ప్రాముఖ్య మీయాలో, ఎంతకాలం వెచ్చించాలో గ్రహిస్తారు. తన శక్తినీ, కాలాన్నీ, అవకాశాలనూ సరిగా వినియోగించుకొని విజయాలు సాధిస్తారు.

4.చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి

     పరులమైన మనం సాంఘిక జీవులం. తోడివారితో కలసిమేలసి జీవిస్తున్నాం బృందాలుగా పని చేస్తుంటాం. ఇతరుల సహాయంలేందే విజయాలు సాధించలేం. మనలను నమ్మితేనేగాని ప్రక్కవాళ్లు మనకు సహాయం చేయరు. అబద్దాలకూ మోసాలకూ పాల్పడితే తోడివాళ్లు మనలను చీదరించుకొంటారు.
  చేసిన ప్రమాణాలను నిలెబెట్టుకొంటేనే గాని జనం నమ్మరు. ఒకసారి మాటయిస్తే ఎదుటివాళ్ళ దృష్టిలో నమ్మకాన్ని కోల్పోతాం. ఇకవాళ్లు మనకు సహాయం చేయరు. ప్రమాణాన్ని తీర్చలేనపుడు అవతిలివారికి ముందుగానే కారణాలతో సహా తెలియజేయాలి.
  మనం ఇంటిలో నొక పాత్ర, పనిలో వేరొక పాత్ర పొషిస్తాం. ఎక్కడ వున్నా మన మాటను నిలబెట్టుల్కొని విశ్వసనీయులుగా మలగాలి లేకపోతే గౌరవము పోతుంది. ఇతరుల సహాయాన్ని పొందలేం.
   ఒకవ్యక్తి ఎదుటలేనప్పుడు అతన్నిగూర్చి చెడ్డగా మటలాడగూడదు. రహస్యాలను బట్తబయలు చేయ కూడదు. విశ్వసనీయత మన మాటలకు కూడ వర్తిస్తుంది. నోరు జారకూడదు.
     ప్రమాణాలు నిలబెట్టుకొకపోతే ఇతరులు నమ్మరు. మనతో సహకరించరు వారిసహకారం లేందే మనం విజయాలు సాధించలేం. మన సామర్ద్యం వీరుగారి పోతుంది.