పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5. ఎదుటివ్యక్తి అబిప్రాయాన్ని గూడ గౌరవించాలి

   మామూలుగా మనం మన అభిప్రాయం మీదనే మనసుపెట్టి వుంచుతాం. ఎదుటివాళ్లకు కూడ సొంత అభిప్రాయాలు వుంటాయని గమనించం. మన ఆలోచనఏ సరైనది అన్నట్లుగా సాధిస్తాం. సహజంగానే ప్రత్యర్ది మనవాదాన్ని వొప్పుకోరు. గొడవ ప్రారంభమౌతుంది. ఎదుటివాళ్ల అభిప్రాయాన్ని గూడ అర్ధం జేసుకొని సాధ్యమైనంత వరేకు దాన్నిఅంగీకరించే ప్రయత్నం చేయాలి.
  అందరూ ఇతరులు తమ్ము అర్ధంచేసుకోవాలనీ, తమ కోరికలను అంగీకరించాలనీ ఆశిస్తారు. కనుక తోదివారు మనకేదో చెప్తున్నపుడు సానుభూతితో వినాలి వారిని పరీక్షించకూడదు. తప్పు పట్టకూడదు నిరాకరించకూడదు.  వాళ్లు చెప్పేది సావదానంగా వింటే మనతో మనసు విప్పి మాటలాడతారు. వారిని పరీక్షించినట్లు గానో తృణీకతించినట్లుగానో మాటలాడితే అంతటితోఫ్తాము చెప్పుబోయేది ఆపివేస్తారు.
   మామూలుగా మనం మన అభిప్రాయాలే సరైనవని అనుకొంటాం. ఇతరులు కూడ మన భావాలను అంగీకరించాలని కోరుకుంటాం. కనుక ఎదుటివాళ్లు చెప్పేది వినం.  వారిని మనవైపు లాగాలని చూస్తాం.  వారిని ప్రశ్నిస్తాం. సలహాలియ్యబోతాం, విమర్శిస్తాం. ఐతే యెడుటివాళ్లు విమర్శను కోరుకోరు. మనం తాము చెప్పేది వినాలనీ, తమ్ముసానుభూతితొ అర్ధం చేసి కోవాలనీ ఆశిస్తారు. ఇంకా ఎదుటివాళ్ల మాటలను వింటేనే చాలదు.  వారి స్వరాన్నీ ముఖ కవళికలనూ గూడ గమనించాలి. మన లోకంలోనుండి కొంచం జరిగి వాళ్లలోకంలోకి ప్రవేశించాలి. ఒకేసారి  యితరులను అర్ధంచేసికొని సానుభూతితో అంగీకరిస్తే వాళ్లు మనతొ సహకరిస్తారు. మనకు అనుకూలంగా మెలుగుతారు అప్పుడు మన కార్యాలు నెరవేరతాయి.

6. మనలను మనం నిరంతరం అబివృద్ది చేసుకొంటూండాలి

  మన మేధ ఎన్నో పనులు చేస్తుంది కాని దానికి శిక్షణ అవసరం గ్రంధపఠనం ద్వారా మొదడుకి మంచి తర్పీదు సేయవచ్చు. పుస్తకపఠనమ్