పుట:Bobbili yuddam natakam.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాంకము. 57

అగుఁగాక. ఈ పాపాత్ముఁడు నాయార్యపుత్త్రుని పసిండి మంచముపై పరుండనయేని దానిమీఁదనే వీనికి చిత్రవధ యగుగాఁక. [పెండ్లికొమారితల నుద్దేశించి] మఱి, మనము పైయాలోచన చేసికొందము. [ఒక దాసిని] ఓసీ కమలాక్షీ, నీవు పోయి సరాబును మే మడిగితి మని చెప్పి. [ఉంగరము దీసి యిచ్చి] యీగుర్తు చూపించి వేయి వరహాలు తెమ్ము.

దాసి. - దేవిగారియాజ్ఞ.

[అని నిష్క్రమించును.]

రాణి. - వేంకటలక్ష్మీ ; ఈ స్వామియెదుట, ఈ యమ్మవారియెదుట ఈనారాయణమూర్తియెదుట, నిన్ను మావంశమును నిలువఁబెట్టునట్లు వేడుకొనుచున్నాను. మాకుఁ గల 33 దాసీజనములలోను నిన్ను పెద్దదాసిగా గణనచేయు చుంటిమి. నీవు మాసంస్థానమును నిలుపఁగదే వేంకటలక్ష్మీ. సామర్లకోటలో మాచెల్లెలు జగ్గమ్మకడకు వేంకటరాయని నీవు కొనిపొమ్ము. మేము బలిమిచావులు చత్తుమని మాచెల్లెలితో చెప్పకువే వేంకటలక్ష్మీ.

వేంకట. - అమ్మా ! మీరు చావను మేము బ్రతుకనా?

[అని కన్నీరు నించును.]

రాణి. - [అశ్రులు దుడుచుకొని] కాదే ; మావేంకటరాయఁడు బ్రతికిన, మేము బ్రతికినట్లే గదే ; వేంకటరాయని పెద్దవాఁ డగుదాఁక, నీవు పోషింపుము. ఆ తర్వాత, మానాయనయే నిన్ను పోషించును. మాకుమారుఁ డని తెలిసినచో, మానాయనను పగవాండ్రు బ్రతుకనీయరే. అడ్డగించువారితో బాపనవారి యచ్చమ్మకొడు కని చెప్పవే. ఓసి మా బాబయ్యకు మొలకు నులకత్రాడు తెచ్చి మొలత్రాఁడు గట్టుఁడు.

[ఒక దాసి పోయి త్రాఁడు తెచ్చి కట్టును.]

రాణి. - ఆరత్నాలమొలత్రాఁడు తీసివేయుఁడు.

[తీసి వేయుదురు.]

రాణి. - ఆభరణముల నెల్ల నూడ్చివేయుఁడు.

[అట్లే చేయుదురు.]

రాణి. - [బాలు నెత్తుకొని] అయ్యో ! నాయనా !

          క. దారులు గొట్టుకిరాతులు
              ఘోరాటవిలోన నధ్వగుల కిడునిడుమల్
              క్రూరను దల్లిని జోరిని
              గారాబుఁగుమార నీకుఁ గావించితిరా ! ౬౩

[అని యేడ్చి] ఓసీ ; మానాయనకు విభూతితెండు.

[ఒక దాసి పోయి తెచ్చును.]

అవ్వ. - ఇటు తెమ్ము.

[అని కైకొని తాను పూయును.

రాణి. - నాయనా, తండ్రికంటె యోగశాలి వని పెదలు చెప్పిరిగాని, యిట్లు