Jump to content

పుట:Bobbili yuddam natakam.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 56

              ఈవిలయంబుఁ ద్రోచెదవ యేని యొసం గెద నీకు హైమముల్
              సీవిరు లాతపత్రములు సింగపుద్వారము తార్క్ష్యయానమున్. ౬౦

మామీదనే పగలు పట్టితివా గోపాలస్వామీ ? మాదొరలు పోయిన శుక్రవారపు టారగింపు నీకు ఎవ్వరు చేయుదురు స్వామీ ?

[స్వామి మెడలోని పూదండలు ధరణిం బడును. కిరీటము గిఱ్ఱునఁ దిరుగును.]

రాణి. - ఆహా అవశకునము ! [అని ఇట్లు పాడును.]

అవశకు నంబులే చూపెను !

అక్కటకటా ! అవ

రాణి. - బాలికలారా, అమ్మవారికి మొఱపెట్టుకొందము. అమ్మా ! తల్లీ ! ఈపెండ్లికొమారితల కంకణాలు స్వర్గములో విప్పింతువా?

బాలికలు. - [ఇట్లు పాడుదురు.]

నమ్మిన మముఁ గావవమ్మా !

అమ్మా తల్లీ, - నమ్మి

రాణి. - హా ! అమ్మవా రేమియు సూచన చేయదాయెను. కానీ, స్వామి యొకటియు, అమ్మవారొకటియు అనుగ్రహింతురా ? మఱి, యిఁక గుడి వెలువడుదుము. [అని పరిక్రమించి] ఇదిగో, వీథిమన్ను [అని మన్నెత్తుట నభినయించి] ఓ దేవతలారా ! నా పూర్వజన్మపు గొఱనోములచేత నిపుడు నాపై కరుణింపరేని, ఓ గోపాలస్వామీ, ఓ మహాలక్ష్మీ, [ఊర్ధ్వ మవలోకించి] ఓ సూర్యనారాయణమూర్తీ, ఓదిక్పాలురారా, నేనే వీరపతివ్రతనేని, మీకు నేను ఈపుట్టువున త్రికరణశుద్ధిగా సేవలుచేసి యుంటినేనియు, ఇది యైన నగుఁగాక: - నా యార్యపుత్త్రునికే, ఈ విజయరామునివలన మరణమగు నేని, ఆమూఁడవనాఁడే వీనిగతియు [అని మన్ను తూర్పారం బట్టుచు] ఇట్లు