58
బొబ్బిలియుద్ధనాటకము.
పకీర నౌదు వని యెవ్వరును చెప్పరైరి నాకొండా ! [అని అశ్రువులు తుడుచుకొని] ఓసీ; మానాయనకు ఒక జందెము తెండు.
[ఒకతె దారము తెచ్చును. అవ్వ దానిని జందెమువలె చేసి బాలునికి వైచును.]
రాణి. - [పుత్త్రుని నిర్వర్ణీంచి] నాయనా !
క. ఏ పేద తల్లి కడుపున
నో పుట్టితివేని హాయి నుందువు తనయా !
యీ పాడు మల్లి కడుపున
నే పట్టీ, పుట్టి యిట్టి యిడుమఁ బడితివే ! ౬౪
వేంకటలక్ష్మీ; 'వడుగైనదా ?' అని యెవరైన నడిగిన, 'కాలేదు, అయిన కుఱ్ఱవాండ్రను చూచి యేడ్చి తానును జందెము వేయించుకొన్నాఁడు.' అని చెప్పవే.
కమలాక్షి. - [ప్రవేశించి] దేవీ, ఇవుగో 1000 వరహాలు, ఇదుగో తమ యుంగరము.
రాణి. - వేంకటలక్ష్మీ, ఒడిపట్టు. [కమలాక్షి నుద్దేశించి] ఓసీ, ఆవరహాలు ఆ యొడిలో పోయుము. [అట్లే చేయుదురు. వేంకటలక్ష్మి గట్టిగా కట్టుకొనును.]
రాణి. - ఈపదార్థమున కాశింపకే వేంకటలక్ష్మీ. కోట తరలఁగానే సోలుజర్లు, సిపాయీలు, రౌతులు, చుట్టువేసికొందురు. వారికి నీయొడిలోని పదార్థము నంతయు వెదచల్లుము. దానిని వారు ఏఱుకొను సందడిలో నీవు తప్పించుకొనిపోవే; [అని శిశువును ముద్దాడును. శిశువు కన్నీళ్లు విడుచును. తల్లి మరల కన్నీళ్లు ఇడుకొని, బుడుతని కన్నీళ్లు దుడుచుచు తనకన్నీళ్లను తుడుచుకొని] అయ్యో ! అయ్యో ! నీవును ఏడ్చుచున్నావా ! నాయనా ! నిన్ను నేనెట్లు ఎడఁబాయుదును నా కూనా ! [అని బాలుని కన్నీళ్లను ముద్దులతో తొలఁగించి] వేంకటలక్ష్మీ, వీఁడుగో నీబిడ్డఁడు; మాబిడ్డఁడు గాఁడు [అని వేంకటలక్ష్మి చేతికి వేంకటరాయని ఇచ్చి కన్నీళ్లతో] వేంకటలక్ష్మీ, ఈదిడ్డివాకిటినుండి వెలువడుము.
వేంకట. - ఇదే దేవిగారికి నాకడసారి దండము. [అని శిశువును దింపి, రాణికి మ్రొక్కి లేచి కైజారు ఒడిలో సముదాయించుకొని, కన్నీ ళ్లుబుకఁగా అడఁచుకొని] తల్లీ !
ఉ. వేవురు సోలుజారు లరివీరులు వచ్చిన, నీకటారితోఁ
జావఁగఁ గ్రుమ్ముదాన, నెడసందునఁ బట్టిని బట్ట నీను; దాఁ
గేవల మింద్రజాల మనఁ గీడ్వడనీయక కాతు నాదొరన్
జీవము మాకు నిల్పఁగ వశీకృతమాయుని సంస్మరించెదన్. ౬౫