40
బొబ్బిలియుద్ధనాటకము.
రంగ.- సాహెబుగారూ; మీరు చెప్పిన దెల్ల మాహితము గోరినమాట గాని, మఱి వేఱుగాదు. మీ రెవరో మాకు అకారణబంధువు లనుటకు సందేహము లేదు. మీయుపదేశముయొక్క సారము, మాకు దాని యాదిలోనే తెలిసినది. మీతోడి సద్గోష్ఠిని సంక్షేపింప నొల్లక మీమాటలను అంతము వినుచుంటిమి. మీరు చెప్పిన నీతిపద్యము, మాకు వెలమకులమువారికి పాఠాంతరముగా నుపదిష్టము ఎటు లన -
క. కలి వచ్చిన నడి గట్టుము,
పులి వచ్చిన నీఁటెఁ బొడువు, పొలియుడు నొలుమీ;
వెలమలతోఁ బోరాడకు;
వెలమలసిరి కాసపడకు, విస మది నీకున్. ౪౬
హసేనాలి. - రావుగారూ ! ఇది ఖడ్గమార్గము గాని కార్యమార్గము గాదు.
రంగ. - అగుఁగాక.
(స్రగ్ధర.)
ప్రాణంబు ల్తీపులౌ ద్రాబల కగునయముల్
భాయి, మా కేల నేర్పన్?
ప్రాణం బన్నం దృణప్రాయ మగువెలమ వీ
రాళికిం గూర్ప వేలా?
నాణెం జౌకప్ప మిత్తున్, నగరు వెలువడన్,
నౌబతు న్మాన; హైదర్
నాణెంబు న్దప్పెనేనిన్ , నరహరి యొసఁగున్
నా కిహంబో పరంబో. ౪౭
సారమింతే, సాహెబ్ సలామ్. ఎంతటి పుణ్యము చేసిననోగదా రణమరణము దొరకును? [తమ్ముని నుద్దేశించి] తమ్ముఁడా ! సాయబుగారు మనయందు అకారణమైత్త్రి వహించి, చాలసేపు మనకు సాంగత్య మొసంగినారు; నీచేతులతో స్వయముగ వారిని సత్కరింపుము.
[నౌకర్లు అత్తరు పన్నీరు చందన తాంబూలములం దెచ్చి వెంగళరావుకడ నిలుతురు.
హసేనల్లీ. - అయ్యా ! మీకు కోపము వచ్చిన వచ్చునుగాక ! నాకుఁ దోచిన మాట పలికి పోయెదను. నాకు మీ పరువు వెఱ్ఱిగా నగపడుచున్నది. మీ బీరము ఏనుఁగు తనతలను తానే మన్నుకొట్టుకొనున ట్లున్నది ! అయ్యా,