పుట:Bobbili yuddam natakam.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాంకము.

41

          క. మీకు శుభమేని రణమృతి,
             మీకులపాలికలు కూళ మ్లేచ్ఛులపా లై
             చీకా కగుటయు శుభమా ?
             యీ కానిమతంబు మానుమీ వెఱ్ఱిదొరా. ౪౮
                                      [వెలమదొరలు ఉగ్రముగా చూతురు.
        రం. - హసేనాలీభాయి, వేయేల ?
          క. మాకులము సతులు పుణ్య
             శ్లోకలు, తముఁ జూచు పాలసులపాలిటికిన్
             భీకర దర్వీకర దం
             ష్ట్రాకర విషవహ్ని కీల లని వినవె సఖా. ౪౯
                                       [వెంగళ్రావు సా హెబును సత్కరించును.
        రంగ. - సలాము హసేనల్లీ బహద్దరుగారికి.
        హసేనాలి. - మఱి ఇఁక నేమి చేయవచ్చును! సలాము వెఱ్ఱి జమీన్దారుగారికి.
        రంగ. - తమ్ముఁడా ! వారిని సాగనంపి రా !
        వెంగ. - అన్న గారి చిత్తము. [హేసేనాలీ వెంగళ్రావు నిష్క్రమింతురు.
        రంగ. - ఎవరోయి అక్కడ?
        ప్రతీహారి. - (ప్రవేశించి) ఏలినవారియాజ్ఞను శెలవియ్యవలెను.
        రంగ. - మాజోస్యులవారు ఈక్షణము దర్శనము ఇప్పింపవలయును.
        ప్రతీ. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమించును.
        రంగ. - [సభ్యులనుగూర్చి] అయ్యా! మనమును మనమీఁద తప్పు లేకుండుటకై రాయబారము పంపవలదా?
        సభ్యులు. - అవశ్యము పంపవలయును

రంగ. - ధర్మారాయఁడా మాబావగారిని పాపయ్యను పంపవలసినపనికి నిన్ను పంపుచున్నాను. మీయక్కగారిని మాకు రాణిగా మీతండ్రిగారు వివాహము చేసినపుడు అరణముగా నీప్రాణమును నీవే ఇచ్చుకొంటివి. ఇంతకాలము మాకు దివానవై మాకు సకలవైభవములం గూర్చుటయే గాక, విజయనగరమువానిని మాజమీనువైపు కన్నెత్తి చూడకుండ చేసితివి. నీ కన్న మా పరువును, మాభాగ్యమును, కాపాడువాఁడు మఱెవ్వఁడు కలఁడు ? కావున, నీవు పరాసుదొరకడ కేఁగి, హసేనాలీతో మేము పలికిన విధమునకు వెలితి రాకుండ, నీమతివిభవముప్రకారము, కాయయో పండో, ఏర్పరించు