పుట:Bobbili yuddam natakam.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

బొబ్బిలియుద్ధనాటకము.

              బండి నిండి పఱచి గండిలోఁ బడినట్లు
              పడియె నౌర ! పదవి బాలికలకు. ౩౧

          హా కోటలో ఊరేగింపు బయట ముట్టడి !

         ఆ. మధువు లాని, యాద మఱచి, మత్తాగొని,
              యాటపాటలందు ననఁగి పెనఁగి,
              తేఁటియాండ్రు గండ్లు గూఁటిలో సుఖముండ
              బయటఁ *[1]గారుచిచ్చు ప్రబ్బి కొనియె ౩౨

         ఏమి యీ దై వమాయ ?

         ఆ. అకట ! నిన్నఁ బెండ్లియైన యిందరు బాల
              లేమి వెలితి నోము నోమినారొ !
              అంతిపురములోని హల్లకల్లోలంబుఁ
              జౌరజనుల గోడుఁ బట్ట వసమె ? ౩౩

[ఆకాశమున చూపు నిలిపి] విజయరాముఁడా, ఇంతపని చేసిన నీవు నాచేత నేమి గతి పొందుదువో ? త్వరగా నామతీర్థము కానిచ్చి, - ఆహా ! ఏమి !

              ఓరోరీ, నానగండా యుదురుమిడుకనీ
                     యూరి కెచ్పైతి వట్రా?
              క్రూరా, మే ముత్సవ వ్యగ్రుల మగుటను నీ
                     కున్ జయం బబ్బు నఁట్రా ?
              పోరా, మా కొల్చువేల్పుల్, పొడుచు కయిదువుల్
                     పొల్లు లై పోయె నఁట్రా ?
              చోరా ? మామీఁదికిన్ ఫ్రాంసులను బదములం
                     జొచ్చి రేఁ దెచ్చి తఁట్రా ? ౩౪

ఈరాత్రి యిట్లు ముగిసినది: - ఆస్థానము చేరెదను. [అని నిష్క్రమించును.

  1. * పా. దావవహ్ని