ద్వితీయాంకము.
31
తనకు మంచిసమయ మని ఆలోచించి, యిపుడు ముట్టడి తెచ్చినాఁడు. నిద్రలో సింగమును పట్టినట్లు నన్ను తెలియనీయక పట్టినాఁడు. ఆహా! బయట వీరు ముట్టడి వైచు చుండఁగా లోపల ఊరేఁగింపులు ఉత్సవములు చేయుచుంటిమి. హా ! దైవ మతనికి ఇప్పటికి ఇంతమాత్రము అనుకూలించినది. కానీ యుద్ధమే జరుగనీ, ఈ పరాసులు నాపోటు నొకమాటు రుచిచూతురు గాక. కానీ! వీరిసంఖ్య హె చ్చయిననేమి?
వెంగ. - అన్న గారికి విన్నపము నే నుండఁగ తమరు పూనుకోనేల? ఇప్పుడు తమసెల వైన -
వసుధ నిం డినయీ పౌఁజుచీ కటికి నేఁ బట్టపగల నయ్యెద!
ఎడలేక పెరిఁగిన యీ దండు కాటికి నెరగలి నే నయ్యెద!
చలియింప కున్న యీ సైన్యమే ఘములకు ఝంఝా వా యున నయ్యెద!
అద్దరి లేని యీ యరిసేనాం భోధికి నగస్త్య ముని నయ్యెద?
సెల వీయవలయును.
రంగ. - నీ వుండఁగా నాకేమి పని తమ్ముఁడా ? కానీ, ఆగడియ రానీ. మఱి నీవు పోయి త్వరగా రమ్ము.
వెంగ. - అన్న గారి యాజ్ఞ.
రంగ. - హా ! ఇంతకాలమునకు నాచేతికి ఆటిన సమరము పొసఁగినది. విజయరాముని గెల్చిన నేమి కీర్తి? నాపోటు ఢిల్లీగోలకొండలలో మాఱుసెలంగును గాక ! పెండ్లికి తరలు రీతిగా పోరికి తరలెద. [నిశ్వసించి] హా ! నిన్న పెండ్లిండ్లు నేఁడు మరణములు !
ఆ. కన్నెవలపుతోడి యన్ను మిన్నల వీడి
కైఁ గొనంగ వలసెఁ గైదువులను ;
బెండ్లి కంకణంబు వీరకంకణముగా
వెలమ యువలచేత విధి దవిల్చె.
ఏమి యీమానవ జన్మము !
ఆ. అంతలోన నెలయు నంతలో మ్రబ్బును;
నంతలోన వాన యంతఁ బిడుగు ;