పుట:Bobbili yuddam natakam.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 94

రాజు. - [ఈయలబలమునకుం బోలె లేచి మంచము దిగి యివలికి వచ్చి కవాచి పై కూర్చుండి] ఏదిరా పులి ? ఎటుపోయినదిరా ? చల్లారామా, ఏమైతివిరా ! హా పులి వానిని వేసికొని పోయినదా ? [అని అన్నివైపుల వెదకుట నభినయించును.]

పాపయ్య. - [ప్రవేశ మభినయించి ఎడమచేతితో రాజును గొంతునం బట్టుకొని కుడిచేత బాకు కొని ఆతని గుండియకుం గదియించి] తప్పించుకొన యత్నించితివా, తక్షణము గటు క్కనిపించెద. రాజా, ఇది అడవి పులిగా దోయి, బొబ్బిలిపులి; దీని పేరు బొబ్బిలి బెబ్బులి తాండ్రపాపయ్య. ఈపులియే చల్లారాముని కొనిపోయినది.

రాజు. - పాపయ్యా, దొంగపోటు పొడువ వచ్చితివా !

పాపయ్య. - నీవు దొంగప్రొద్దున గదా ముట్టడి వేయించితివి ?

[నేపథ్యమున.]

'హా ! నారాయణ ! నారాయణ !'

రాజు. - హా ! హా! చల్లారాముని గొంతు ! [స్వగతము] బయట ఇతనిసిబ్బంది వచ్చియున్నారు గావలయు. (ప్రకాశము) పాపయ్యా, నిన్నుఁ జూచినతర్వాత, ఎంత పరివార మున్నను, ఇంక నేమి ఆశలు ? ఈ బొబ్బిలి నీ కిచ్చెదను, నాప్రాణములు కొనకు పాపయ్యా.

పాపయ్య. - ఆహాహా !


           సీ. బొబ్బిలి యిత్తువా? యబ్బబ్బ శిబి కర్ణ
                       థారాధరులకన్న దాత వైతి !
               నీపాడుప్రాణంబు నేను గైకోనురా,
                       గాలిలోపల నది కలయుఁ జుమ్ము.
               ఉండెఁబొ మ్మామాట ; యూడెనా యోరి నీ
                      ప్రక్కలోపల నున్న బల్లెకోల ?
               వెలికి వచ్చెనొ కంటినలుసు నీ కిప్పుడు ?
                      పరులసొ త్తాశించు ఫలము గంటె ?
           తే. వీఱిఁడికి నీకు జగదేకవీరుఁ డైన
                      రావుపైఁ బగ యన నేమి రా బజీత ?
               వెంగళుని పెండిలికి నన్ను వెడలకుండఁ
                      జేసిన ఫలంబుఁ గుడువు చేసేత నిపుడు.
౭౮