పుట:Bobbili yuddam natakam.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాంకము. 93


               ళింగుం జూపి, తృషం దదస్ర ఝర పా
                      ళిం దీర్పు మన్సంజ్ఞ గాఁ
               గం, గైదొన్నె ఘటిం త్రయారె! యిదె రం,
                      గా వెంగ, నేఁ దీర్చెదన్. ౭౫

               హా ! మరల ని|దేమి ! హా !
           క. ఈతని ద్రోహమువలనన్
               గాతర లై యగ్నిఁ బడిన కంజాతాస్యల్
               చేతుల సన్నలచే నను
               నీతని మెడఁ గోయు మనుచు నెగచెద రరరే!
౭౬

ఇఁక తడయంజనదు. నిద్రపోవుచున్న యీమూఁకను మదీయ సింహగర్జనముల చే 'ఓరి, వచ్చి మీరాజుం గాచుకొండిరా:' అని పిలుతునా ? వలదు, ; అట్లు చేసిన వీఁడు నారాక యెఱింగి పలాయితుఁడై దాఁగును. కావున లోనికి పోయి వచ్చినపని కావించెద.


           ఆ. ఏనుఁగునకుఁ దుల్య మితని దేహము గాన
               మేటి శిరము వ్రచ్చి మెదడు వడయఁ
               గుత్తుకను బగిల్చి నెత్త్రువాఁకను బొంద
               నేను సింహ మవుదు నీక్షణమున.
౭౭
                                  [అని లోనికిఁ బోవుట నభినయించి, బాకును దూయును.]

[అంతట ఒకసేవకుఁడు కునికిపాట్లు పడుచు, పాదము లొత్తు చుండ, మంచముపై నిద్రితుఁడు రాజు ప్రవేశించును.]

పాపయ్య. - (రాజుం దఱసి) పులి ! పులి ! పులి !

రాజు. - [మేల్కొనుట నభినయించుచు] లేవకయే పొడు పొడు పొడువు.

[సేవకుఁడు పాపయ్యతోఁ గలియఁబడును. పాపయ్య వానిమెడ నొకచేతం బట్టి బయటికిం దెచ్చి సీతన్న చేత దానిం బెట్టును. సీతన్న వాని నట్లే కొని నిష్క్రమించును. పాపయ్య మరల లోనికి పరిక్రమించును.]