నవమాంకము.
స్థలకము - స్కంధావారములో విజయరామరాజు డేరాకడ.
[తాండ్రపాపారాయఁడు మిరియాలసీతన్నయు ప్రవేశింతురు.]
సీతన్న. - వచ్చితి మయ్యా పాపయ్యా విజయరాముని డేరాకు. అందఱు బాగుగా నిద్రపోవుచున్నారు. పూర్వము, అశ్వత్థామ సౌప్తికము చేయలేదా ? అయినను మనము నిద్ర మేలుకొలిపియే చేయుదము. నేను బయట కాపుండెద, డేరాకడకు వచ్చినవారి నెల్ల క్రుక్కు మిక్కు అననీయక పరిమార్చుచుండెద. బుస్సీని రప్పించుటకు వీరిఫిరంగులు వారి డేరాలమీదికి అగాదు చేసెదను. నీవు సావకాశముగా రాజునకు జమునిబేటి చేయింపుము. లోనికిం బొమ్ము.
పాపయ్య. - సరి, సీతన్నా, అట్లే కానిమ్ము [సీతన్న నిష్క్రమించి డేరాద్వారము కడకు మరల మరల వచ్చుచుం బోవుచుండును.]
పాపయ్య. - బళీ ! మిరియాల సీతన్న పనిచే బుస్సీ వచ్చి నాపనిం జూచును గాక. వీఁడు నేను లే నప్పుడు గదా, నారాయనిని హతముచేసినాఁడు. నేనిపుడు వీనిని, బంధు మిత్త్ర పరివార బలత్రితయ సమేతుని హత మార్చెదను. వేనవేలు వీరభటులచేతఁ గదా వీఁడు నారాయనింగారులను, ఒంటరులను ఒక్కొక్కని మడియింపించినాఁడు. నేను ఒక్కండన వీనిని వీనిం గావ నేతెంచువారినిం గూడ పరిమార్చెద. హాహాహా ! ఏమి కనబఁడుచున్నది !
శా. రంగారాయఁడు, వేంగళేద్రుఁ, డనుఁగుల్,
రౌతుల్, భటుల్, రక్తది
గ్ధాంగుల్ నన్ మిడికన్నులం గనుచు జి
హ్వల్ దోఁప నో ళ్ల్వచ్చి, కా