నవమాంకము. 95
[నేపథ్యమున ఫిరంగియగాదులు]
పాపయ్య. - ఒకమాట కయిన బదులు చెప్పవయ్యా. నాచేతిపట్టుచేత నోటమాట రా కున్నదా యేమి ? పట్టు కొంచెము సడలించెదను. [అని అట్లు చేయును.]
రాజు. - [ఊపిరి త్రిప్పుకొని నిట్టూర్పు నిగిడించి]
శా. పాపారాయఁడ, రాచపుట్టువను, నీపాదంబులం బట్టితిన్ ;
నాప్రాణంబులఁ గావు, నిండుకరుణ న్నాపాలిదైవంబ వై.
పాపయ్య. -
పాపా, వూనితికాదె బాలుఁ గరిచేఁ బాదాన మట్టింపఁగా!
నీ పాపంబులు నాకుఁ దెల్పినది వానిం దాది కొంపోవుచున్. ౭౯
నీవు నాశము చేయించిన మాకోటను గూడ చూచి వచ్చితిని జుమా. రాజా, మారంగారాయని బంగారపు మంచముమీఁద పరుండెద నని ప్రతిజ్ఞ చేసితివఁట; నేను వచ్చుతఱికి దానిమీఁదనే గదా ఉంటివి, నిన్ను దానిమీఁదనే సుఖముగా పరుండఁ బెట్టి పెద్దనిదురఁ బుచ్చెద. ఇదిగో నిన్నుఁ గొనిపోయెద. పులినాకిన యెద్దా ?
[అంతట - బుస్సీయు హైదరుజంగును ప్రవేశింతురు.]
[పాపయ్య రాజును పిల్లికూనం బోలె ఎడమచేత మెడ పట్టుకొని యున్నవాఁడు, అట్లే కుదిలించుచు, నిష్క్రమించును.]
బుస్సీ. - ఏమియిది! గడ్డి మేటిపాటి మూటను తాటిచెట్టు పాటి జమీను, ఎడమ చేతితో లోనికి కొనిపోవుచున్నాఁడు ! ఈరాజు తన సామా నంతయు తరలించుకొను చున్నాఁడు గావలయు ఆహా ! ఎంతమోసగాఁ డీతఁడు ? పేష్కస్సులు ఎగవేయుటకై మనలనే సంహరింప మనమీఁదికే ఫిరంగులు త్రిప్పినాఁడు !
హైదరు. - [స్వగ.] నాకీ వప్కొన్న లక్షవర్హాలు యెగెయ్యడానికిసహా.
[అంతట ప్రేవులహారాలతో రుధిరస్థానకముతో, అట్టహాసముతో, తాండ్రపాపయ్య ప్రవేశించును.]
పాపయ్య. - [ఇటునటు వికటముగా పరిక్రమించుచు, పరవళ్లు ద్రొక్కుచు,] పూర్వము తాండ్రపాపారాయఁడను, ఇపుడు రాకాసిమన్నీఁడ నయితిని. అయినను నాజూకుగా. -