పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 29

పడుపుకత్తె పైకముచూపితే పరుగెత్తివచ్చును గాని రుద్రాక్ష పేరుల చప్పుడు విని ఈవంక వచ్చునా? పాటపాడితే గాని నీకు పైకమబ్బదు. అందుచేతనే కాబోలు పిచ్చిదానిని చేజిక్కించుకొనయత్నించినావు-అది శ్మశానమునకు పారిపోయినది.

సాధు - వెర్రివాడా, నాకుకాదు, నీకని నేనుచెప్పలేదా?

బిచ్చ - హరిహరీ! ఇది నేనెరుగను - నీవు వగకాడవు గనుక పిచ్చిదానిపై నాసవిడిచి దాసికొరకు తల్లడిల్లుతూన్నావు. నాదగ్గిర దాచకు-ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేవాడను సుమా! ఈదాసి ఆడదైనా నూరుగురు మగవాళ్ళను చంపి పుట్టింది బాబూ! అదిగో బ్రహ్మరాక్షసిలాగు వస్తూన్నది-(పరుండును.) మూస:Cnter దాసి - ఇద్దరు పెద్దమ్మ లిక్కడ చేరినారూ? తాళము పగులగొట్టి లోన దూరలేదు కదా!.... వీళ్ళు దొంగలుకారు. ఓహో! అయ్యగారు దయచేసినా రా?

సాధు - వచ్చినాను.

దాసి - నేడు మాయజమానిగారు రానందున యజమానురాలివద్ద నుండవలసి వచ్చింది. ఇక్కడికి రావడము మాట మనస్సులో పెట్టుకొనే ఉంటిని - చిన్న కునుకు పట్టింది. పాపము మిమ్ము కష్టపెట్టినాను, పొగాకైనా తేలేదు-పొద్దు పోయినప్పటినుంచీ యిక్కడే ఉన్నాను. ఇంటికి పోలేదు-ఏమి చేయడానికీ తోచలేదు. దీపమువెలిగించి పొగాకుతెచ్చి అరుగు మీద కూర్చుండి మీయుపదేశము వింటాను...(పోబోవును)