పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30 బిల్వమంగళ [అం 2

బిచ్చ - చూచినావా దీని విశ్వాసము! తిరిగి వస్తానంది - నీవు నన్నెరిగినట్లు దానికి తెలియనీయకు-ఇద్దరినీ గెంటి వేయగలదు.

సాధు - పొగాకు కేమిలే-నీవుండు. నేను రామేశ్వరము, హరిద్వారము, నాసిక, పూరి చుట్టివచ్చినాను గాని నాకు నచ్చినవా ళ్ళెక్కడా కనబడలేదు.

దాసి - ఆమాట నిజమే. అట్టివాళ్ళు దొరకడము అలభ్యయోగమే. నాకిప్పటికి ఇరువైయొక్కసంవత్సరములు గడచినవి. ఆఁ చైత్రామాసానికి పందొమ్మిది నిండినవి, నాకూ అట్టివాళ్ళు లభించలేదు.

సాధు - నీవుమాత్రము నాకు చక్కగా నచ్చినావు.

దాసి - గట్టిగా మాటలాడకు. ఇక్కడో బికారి యున్నాడు, వాడిచెవిని మనమాటలు పడితే మనకిద్దరికీ పొసగడము కష్టము.

సాధు - నీకు రాధాప్రేమతత్వ ముపదేశించ వలె నని నా కోరిక.

దాసి - మంచిమాటే.

సాధు - సావధానముగా విను. ఈ సంసారసాగరము దాటవలెను.

దాసి - ఔను.

సాధు - దానికిముం దీవేశ్యావృత్తి మానవలెను, వెలయాలియై యుంట వెర్రికాదె?