పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 బిల్వమంగళ [అం 2

సాధు - నీవిటనున్నావని తెలుస్తే రెండుమాటలు నేర్పియుందును.

బిచ్చ - ఇప్పుడు నేర్పిన ప్రయోజనము లేదు - మేఘము లింకా విరియలేదు, ముసుగుదన్ని మూడంకెవేసి నిద్రపోయెదను. శిష్యుడు చేయవలసినపని నే నెరుగుదును.

సాధు - దాసి యిటువస్తే నేనొక గొప్పసిద్ధుడ నని చెప్పు.

బిచ్చ - ఆలాగే - ఈదాసీతో వ్యవహారము సామాన్యముకాదు. నీమాట లిక్కడ సాగవు - అది కత్తికోతకత్తె. గురు శిష్యసంప్రదాయము చెల్లేటట్లులేదు. నీవు దానికి బోధించినది నేనెరుగుదును. రాధాకృష్ణనాటక మాడవలెనని నీ యూహ-అది తెనిసినవాడను గనుక నీతో ఈ ప్రసంగ మెత్తినాను.

సాధు - నాశిష్యుడవని అను-అందు ప్రమాద మేమి?

బిచ్చ - నీ వేషము గంభీరముగా నుందిగాని దానికి తగిన యోగ్యత నీకు లేదు. తెలివితక్కువ కాకుంటే తెల్లవారిన తరువాత గురుశిష్యధర్మ మెందుకు? నిశీథమున నిష్ఠయందున్న ప్పుడు గురవేనమ: యందును.

సాధు - నీవుపోయి పరుండు - నే నీదాసితో కొంత ముచ్చటించవలెను.

బిచ్చ - తెల్లవారిన పిమ్మట కూడదా? తత్పూర్వ మామె దర్శనమె దుర్లభము. పట్టెమంచముపై పరుండిన