పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండో అంకము

________

ఒకటో రంగము

(చింతామణియింటిలో సాధు బిచ్చగాడు)

సాధు - నీ కీయింటి వద్దనేనా పని?

బిచ్చ - ఔను - మాట యిచ్చినాను, దానిని మరతునా?

సాధు - పనేదో చెప్పు వింటాను.

బిచ్చ - చిన్న పనే. ఈయింటియజమాని తానిక్కడ లేనప్పు డిక్కడికి ఎవరెవరు వత్తురో చూడుమని నన్నంపినారు. ద్వారము దగ్గర ఉంటిని, వర్షము కురుస్తూంటే లోనికి వచ్చినాను. స్త్రీ లితరుల వంచింపబోయి వారే వంచింపబడుదురు. నేను పరదేశినని కేక వేసినాను - అటుకులు, బెల్లము, పెరుగు, పెట్టినారు. నన్ను పోల్చినారేమో - "ఆమాడుమొగమే పంపించియుండు"నన్నారు. ఇల్లు ఎవరో తుడుస్తూఉంటే జల్లు కొట్టుతున్నదని కేక వేసితిని, ఈమూల నుండు మన్నారు. నీవు రాత్రి అంతా మేలుకొని యుంటి వెందుచేత?