పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26 బిల్వమంగళ [అం 1

అగ్గిచల్లారింది...ఆహా! నామనోహారిణి ఎక్కడ నుందో? మన మిద్దరమూ చెరియొకచోటా వెదకుదాము రా. అమ్మా! అమ్మా! ఎక్క డున్నావు? ఇక్కడ అవతరించరాదా?

బిల్వ - నిబిండాంధకారము, దిక్కు తోచదాయెను! ప్రాణము పోజాలదన్న మాట నిజమే. అయ్యో! నాప్రాణము పోతే చింతామణిని చూడడ మేలాగు? మేఘగర్జనమా, నీకు జడియను, నదీతరంగములారా! మీ కోలాహలముకు వెరవను. దేహమా! నీయందలి మమకారము విడిచినాను. చింతామణిని గాంచకల్గుదునో లేదో అను సంశయము మాత్రముంది. అదిలేకున్న నీ వొక నదివా? పిల్ల కాల్వపాటి ఉండవు - సముద్రమైనా దాటడానికి సిద్ధము - చింతామణీ, చింతామణీ!

పిచ్చి - చింతామణీ! నిన్ను గనగోరడము వృధా. పిచ్చి దాననై ఇల్లు విడిచితిని. ఎంతవెదికినా కానరావు, ఎంతపిల్చినా పలుకవు - రాత్రి భయంకరమై యున్నది. అదిగో! నాపిచ్చివాడు! మొగ మలాగే ఉంది. ప్రాణప్రియ చింతామణి ఒంటరిగా నుంది - నేను పోయెదను. .........(పోవును)

బిల్వ - నేనూ చింతామణిని గాంచెదను - చింతామణీ!

(నదిలో దుముకును)