పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 4] బిల్వమంగళ 25

                     వనమాల ధరియించి ♦ వలపులో జిక్కి,
                               వనమాలి వెతకుచు ♦ వనిత తా స్రుక్కు
                     పురుషుని ప్రకృతిని ♦ పోషించుచుండు
                               విపరీతమగు రీతి ♦ వేడ్క దోపగను.
                     ఒక్కచో శవము వే ♦ రొక్కచో చపల,
                               ఏకాకృతిగ నుండు ♦ నెందుజూచినను,
                     కాలంపునియమముల్ ♦ గానరా వచట,
                               లేదు హిల్లోలంబు ♦ లేదు కలకలము,
                     నిమ్మకు తొక్కిన ♦ నీరంబువోలె
                               నిశ్చలంబై దోచు ♦ నెచ్చట గనిన.
                     మానసము వాక్కును ♦ గానంగలేవు,
                               ఆది యంతము లేని ♦ యతులస్వరూప,
                     రూపము న్నామము ♦ రోయలే రెవరు,
                               గతమును భావియూ ♦ గానంగ రావు,
                     అంతయు ప్రకృతంబు ♦ వింత గొల్పెడును;
                               చింతామణియె నాదు ♦ చిన్నారిచిల్క.

బిల్వ - నా చింతామణేనా ? ఇన్ని దినాలనుండీ ఆమె రూపసీమను గాంచలేకున్నాను. అదియవాఙ్మౌనసగోచర! ఎట్లు చేరగలను? ఏమిచేయుదును? చింతామణీ, చింతామణీ, ఇక్కడే నాప్రాణాలు విడువవలసివచ్చునా ఏమి? దైవమా!

పిచ్చి - ప్రాణములు పోగలవా?... లేదులేదు - అవి పోవు - నీటిలో నురికినాను, - నీ రెండిపోయింది. అగ్నిలో పడ్డాను -