పుట:Bible Sametalu 2.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామెతలను ఉపయోగిస్తారు. దున్నపోతులు కుక్కలే కాకటుండా కొందరు మానవులు కటూడా ఇతర మానవులకు అడ్డుగా నిలుస్తారు. వారు ముందుకు సాగరు, ప్రక్కవారిని సాగనియ్యరు. వారు తినరు, వేరొకరిని తిననీయరు. వారు అభివృద్ధి చెందరు, ఇతరులను అభివృద్ధి చెందనీయరు. ఇటువంటి నందర్భాలలో ఈ తెలుగు సామెతలను వాడుతుంటారు.

బైబులు సామెత కటూడా ఇదే భావాన్ని బోధిన్తున్నది. కొందరు నుబోధ వినరు, వేరొకరిని విననీయరు. వారు న్వర్గంలో ప్రవేశింపరు, ఇతరులను ప్రవేశింపనియ్యరు. వారు మంచి పని చేయరు, చేనేవారిని చేయనియ్యరు. ఇటువంటివారి నైజాన్ని వివరించడంలో ఈ బైబులు సామెతను వాడతారు.

పినినారి ధనం కటూడబెట్టి తాను తినక, ఇతరులకు దానం చెయ్యక, దానిని నాశం చేస్తాడు. ఇక్కడ అడ్డుబండలుగా నిలచేవారు, వారు లోపలికి వెళ్ళరు, వేరొకరిని వెల్లనీయరు. వారు బాగుపడరు, ఎదుటివారిని బాగుపడనీయరు. ఈ భావాన్ని తెలుగు, బైబులు సామెతలు నమానంగా చాటి చెబుతున్నాయి. 8 తెలుగు సామెత : గాడిదకేమి తెలును గంధపు పొడి వానన? బైబులు సామెత : దుషువలు మంచిని ఎట్లు మాట్లాడగలరు? (మత్తయి 12:34) దాశరధి శతకాన్ని రచించిన గోపన్న (రామదాను) 'నరనుని మాననంబు నరనజ్ఞుడెఱుంగును, ముష్కరాథముండెఱిగి గ్రహించడెట్లు.... అంటూ ఒకే కొలనులో నివానమున్నా, కప్పకు కమలంలోని నువానన, దానిలోని మకరందం రుచీ తెలియదనీ, ఎక్కడినుంచో వచ్చిన తుమ్మెద, ఆ కమలంలోని సౌరభాన్ని ఆఘ్రాణించి, మకటరందాన్ని గ్రోలి పరవశానందాలు పొందుతుందనీ చెబుతాడు. నువాసనను గ్రహించే శక్తి మిళిందానికి ఉంది గాని కప్పకటు లేదు. అలాగే గాడిదకటు బరువులు మోయడం తెలును గాని గంధపు చెకట్కల సౌరభ'ం తెలియదు. అది గంధపు చెక్కల్ని మోసినా, వేపదూలాలు మోసినా బరువు నంగతి దానికి తెలున్తుంది గానీ నువానన నంగతి తెలియదు. ఎద్దుకేం తెలును అటుకటుల రుచి అని దీనికి నమాన భావం గల మరొక తెలుగు సామెత ఉంది. అంటే మంచిని గ్రహించడం మంచివారికే తెలున్తుంది గానీ చెడ్డవారు మంచిని గుర్తింపలేరని దీని గూఢార్థం. 107