పుట:Bible Sametalu 2.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బైబులు సామెతలో కూడా ఇదే భావం న్ఫురిన్తుంది. దుష్టులు మంచిని ఎట్లు మాట్లాడగలరు? అనగా దుష్టులు దుష్టత్వాన్ని గ్రహిస్తారు గాని మంచితనాన్ని గ్రహించలేరని దీని భావం. మంచివాడు తన హృదయంలో ఉన్న మంచిననునరించి మంచి మాటలే మాట్లాడతాడు. చెడ్డవాడు తన హృదయంలో ఉన్న చెడుననునరించి, చెడ్డమాటలే మాట్లాడతాడు. వేపచెట్టు వేపకాయల్నే కాన్తుంది గాని మామిడి కాయలను కాయదు కదా. ఒక్క జల నుండే మంచినీరు, ఉప్పునీరు ఊరవు కటదా.

'చెప్పు తినెడి కక్క చెఱకు తీపెరుగునా అంటాడు వేమన. కటనకపు సింహాసనం మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేనినా కుక్కక తన నహజ గుణాన్ని మానుకోలేదు. అందుకే ప్రజాకవి వేమన ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవగుణంబు మానలేడు, బొగ్గుపాల గడుగ బోవునా మలినంబు అంటాడు. గాడిదకు గంధపు చెకట్కల వానన తెలియనట్లే, దుష్టులకు మంచి మాటలు మాట్లాడడం తెలియదనేది నిర్వివాదాంశం. 9 తెలుగు సామెత : తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచే బైబులు సామెత : దుషువడు తోడివారిని మోనగించి అపమార్గము పట్టించును (సామెతలు 6:29) సాధారణంగా కొందరు చెడు వ్యసనాలకు, దురలవాట్లకు బానినలైపోతారు. వారు తాము ఊబిలో కూరుకుపోతున్నామన్న నంగతిని గుర్తించకుండా, ఇతరులను కూడా అందులోకి లాగే ప్రయత్నం చేస్తారు. ఆ అలవాట్లలో, వ్సనాలలో ఎంతో నంతోషం ఉందనీ, ఎన్నో ఆన్తులు, నంపద కొద్ది కాలంలోనే నంపాదించవచ్చనీ ప్రలోభ'పెట్టి చుట్టూ ఉన్నవారిని, బంధుమిత్రులను కూడా ఈ రొంపిలోకి దించుతారు. ఆ మాటలు విని వారితో చేరినవారు కూ కొద్ది రోజుల్లోనే శంకరగిరి మాన్యాలు పట్టిపోతారు. అందుకే మాయ మాటలను, కల్లబొల్లి కబుర్లను నమ్మవద్దని పెద్దలు హెచ్చరిన్తూనే ఉంటారు. తెలుగు సామెత ఈ విషయాన్ని పోలిలతో చెబుతుంది. కోతి తాను చెడింది కాక వనములోని ఇతర కోతులను, వనాన్ని పూర్తిగా నాశం

108