పుట:Bible Sametalu 2.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

(భ'ర్తృహరి నుభాషిత రత్నావళి, దుర్జన పద్ధతి, పే. 73, ఏనుగు లకట్ష్మణ క వి). పరులను పీడింపక గడ్డి పరకలతో పొట్టపోనుకొనే జింకలకు బోయవారు, నీటిలో బ్రతికే మీనములకు జాలరులు, దొరికిన దానితో నంతనించి కాలం గడిపే నజ్జనులకు కొండెగాండ్రు అకారణ శత్రువులు. కొంపలు కూలితే ఏదో పైశాచికానందమే తప్ప వారికంటూ ఏమీ ప్రయోజనం ఉండదు. నొటి విరుపులతో, శ్లేషలతో, అర్థ సత్యాలతో అనుమానభూతాన్ని నట్టింట నిలుపుతారు వీరు. అది 'ఇంతితై వటుడింతై' అన్నట్టు వేరూని శాఖోపశాఖలై పచ్చని కాపురం రచ్చకెక్కుతుంది. ఇలాటి తంటాలమారులు చన్తే పీడ విరగడౌతుందని వేమన అభిప్రాయపడ్డాడు :

'కొండెగాడు చావ, గొంప వాకిటికిని వచ్చిపోదు రింతె వగపు లేదు దూడ వగచునె భువి తోడేలు సచ్చిన?' ఇలాంటివారి పట్ల జాగరూకతతో ఉండాలని ఈ సామెతల నందేశం. 7 తెలుగు సామెత : గాటిలో కుక్క గడ్డి తినదు, తిననీయదు రెడ్డివారి దున్నపోతు తానెక్కదు, ఇంకొక దానిని ఎక్కనియ్యదు

బైబులు సామెత : మీరు న్వర్గములో ప్రవేశింపరు, ప్రవేశించువారిని ప్రవేశింప నియ్యరు (మత్తయి 23:14)

పశువులకు మేత వేయడానికి ప్రత్యేకంగా వాటి ముందు గాడి తయారుచేస్తారు. అందులో మేత వేన్తే పశువులు నిరాటంకటంగా తినడానికి వీలౌతుంది. గాటిలో మేత తప్ప ఇంకేమీ వేయరు. అటువంటి గాటిలో కుక్కక ఉంటే పశువులకు చాలా ఆటంకటం. ఆ కుక్క గాటిలోని గడ్డిని తాను తినదు. ఇతర పశువులను తిననీయదు. రెడ్డివారి దున్నపోతు తానెకక్కదు, ఇంకొక్కదానిని ఎకట్కనీయదు అనే తెలుగు సామెత కటూడా ఇటువంటిదే. ఇటువంటి నంకట న్థితిని వివరించడానికి పై తెలుగు

106