పుట:Bible Sametalu 2.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10 తెలుగు సామెత : పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా? బైబులు సామెత : స్నానము చేయించినంత మాత్రమున పంది బురదగుంటలో పొర్లాడకట మానునా? (2 పేతురు 2:22) ప్రకృతి సహజమైన ప్రవృత్తిని ఏ జీవీ అధిగమించలేదు అని వీని మౌలికార్థం. అయితే ఇంతకన్నా మించిన నైతిక భావనే ఇందులో ధ్వనిన్తుంది. దుర్మార్గులు తమ దుష్టీ నైజాన్ని మార్చుకోగలగడం దుర్లభం అనే వాన్తవాన్ని చెప్పే సూత్తులివి.

  కనకపు సింహాసన ఒక శునకము కుర్చుండ తగునా?' అన్నట్టుగా శునకాన్ని పసిడి గద్దెపై అధిష్టింప జేయడమెంత అనుచితం సూకరానికి స్నానం చేయించడం అంత అనుచితం, అనవనరం. వేమన వేరొక పద్యంలో కూడా జీవులలోను, మనుషుల నైతిక జీవనంలోనూ పరివర్తనా రాహిత్యాన్ని ప్రస్తావించాడు.
  ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉదికినా నలుపు నలుపీగానితెలుపురాదు
  అన్నట్టుగానే బొగ్గును పాలతో కడగడం ఎంత నిరర్ధకతమో కూడా వేమన చెప్పాడు.
   ఈ బైబిలు సామెతకు జతగా తాను కక్కిన కూటికి కుక్క ఆశించును అని ఇదే వచనంలో పేతురు భక్తుదు ప్రస్తావించాడు. ఈ సామెతను పేతురు సామెతలు 26:11 నుండి పరిగ్రహీంచాడు. పందిని గురించి జన సామాన్యంలో ఉన్న సామెతను పై సామెతకు తానే జోడించాడు. మూర్ఖుడు తన మూర్ఘపు పనులకు మరలడం కుక్క తాను కక్కిన కూడు తినడంతో పోలిక చెప్పడం చూన్తున్నాము. కుక్క తోకను ఎంతగా నవరించినా అది వంకరే కదా. కాగితం పూలు సౌరభం వెదజల్లుతాయా?
  నల్లజాతివాడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన పొడలను మార్చుకోగలదా?? అని నర్వేశ్వరుడు యిర్మీయా 13:23 లో ప్రశ్నించినదీ ఇలాటి నందర్భంలోనే. ఇకద ప్రకృతి శీద్ధంగా జీవులు తమ సహజ నంవేదనలను, స్వతసిదంగా తమ లక్షణాలను  ఎలా మార్చుకోలేవో అలానే దురితాలకు అలవాటు పడి భ్రష్టమై పోయిన మానవులు తిరిగి నంస్కారవంతులు కాలేరు.
  దేవుని యథార్థ ప్రేరణ మూలంగా గాఢమైన పరివర్తనం చెంది ఆయన మార్గాల ననునరించేవారు గాక, ఇతరత్రా బాహ్య కారణాల వల్ల మత భక్తి గలవారుగా
                      94