పుట:Bible Sametalu 2.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ముసుగు వేనుకొని తాత్కాలికంగా 'కొత్త పిచ్చి' అన్నట్టు తమ చెడు అలవాట్లను వదిలినవారు త్వరలోనే తమ నిజ న్వరూపాలతో తిరిగి సాక్షాత్కరిస్తారు. మరలా తమ భ్రష్ట క్రియల వైపుకు మళ్ళుతారు. పందిని జాగ్రత్తగా సుగంధ ద్రవ్యాలతో కడిగినా దాని స్వభావం బురదలో దొర్లడమే. లౌకిక శక్తుల నుండి తప్పించుకొన్నా, మళ్ళీ ఆ శక్తులకే చిక్కి పరాజితులైతే ముందటి కన్నా మరింత దురవస్థికి వారు లోనవుతారని పేతురు వివరించాడు. "దానికంటె వారు నన్మార్గమును ఎరుగకయే ఉన్నచో వారి స్థితి కొంత బాగుండెడిది" (వచనం 21).

 పంది తిరిగి బురదలో దొర్లకుండా ఉండాలంటే అది ఇక పందిగా ఉండక రూపాంతరం చెందాలి. గొంగళి పురుగు నీతాకోక చిలుకగా మారడాన్ని దీనితో పోల్చలేము. ఎందుకంటే అవి రెండూ ఒకే జీవిత చరిత్రలోని రెండు దశలు. యోహాను 3:3 లో మనుష్యుడు మరల జన్మించితేనే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీన్తు పలికిన వాక్కులిలో దీనికి జవాబున్నది. సూకరము వంటి వ్యక్తి మరొక జన్మ ఎత్తి గొర్రెగా అవతరించిన రీతిలో దైవశక్తి, పవిత్రత అతనివ్యక్తిత్వపు అట్టడుగు వరకు ప్రభావంచూపి అతనినొక నూతన జీవిగా మార్చినప్పుడే మరలా బురద వైపుకు తిరగడం అనేది జరగకుండా ఉంటుంది. గొర్రె బురదలో సౌకర్యంగా ఉండలేదు కదా.
మనుషులలో ఇటువంటి మార్పు సాధ్యమే. అయితే ఏదో ఒక బాహ్య కారణం వల్ల,పరిన్థితుల ప్రాబల్యం వల్ల పైపై మార్పు చవిచూచిన వ్యక్తి తన నైజాన్ని మార్చుకోలేక తిరిగి తన పాత జీవిత విధానానికి తిరిగిపోవడాన్ని దృశ్యమానమైన రీతిలో ఈ సామెతలు చెబుతున్నాయి.
             
           11

తెలుగు సామెత : పెంటమీద రాయి వేన్తే ముఖమంతా చిందుతుంది బైబులు సామెత :మూర్ఖుని మందలించువాడు నవ్వులపాలగును,దుష్టుని

       హెచ్చరించువాడు అవమానములు తెచ్చుకొనును
        (సామెతలు 9:7)
           95