పుట:Bible Sametalu 2.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేపకు చేదు రుచి అనేది సహజ సిద్ధముగా వచ్చిన లక్షణము.ఆ లక్షణాన్ని ఎంతగా పోగొట్టాలన్నా పోగొట్టలేము. చిన్న మొక్కగాఉన్నప్పుడే నీటికి బదులు తేనెను పోసి పెంచినా కూడా దాని చేదు పోదు.తేెనె సృష్టిలో అత్యంత మధురమైన పదార్ధాలతో ఒకటి. అటువంటిశ్రేష్ఠమైనదానిని తెచ్చిపోసి పెంచినా ఆచేదులక్షణమనేదివేపనువీడిపోదు.అదే విధముగా మూర్ఖుని ఆలోచనా తీరును,అలవాట్లను మార్చాలనుకోవడం వృధాప్రయాసే అవుతుంది. మార్చాలనుకొని పోయిన వారికి భంగపాటు తప్పదు. వారికి ఎంత మంచి పలుకులు, ఉదాహరణలు చెప్పినా కూడా అవి వ్యర్థమే. వారు వాటి నుండి ఏమీ నేర్చుకోరు. కనీసం పట్టించుకోనైనా పట్టించుకోరు. వేప మొక్కకు తేనె పోసి, అనవనరముగా వృధా చేసుకున్నట్లవుతుంది. మూర్ఖుల విషయంలో జాగరూకులై ఉండవలసిన ఆవశ్యకతను ఈ సామెతలు తెలియజేన్నాయి. ' వేము పాలు పోసి ప్రేమతో బెంచిన

   జేదు విరిగి తీపి చెందబోదు
   ఓగునోగె కాక యుచితజ్ఞుడెట్లౌను'
  అనే పద్యంలో వేమన ఈ సామెతను పొదిగాడు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోదు. కుట్టడం తేలు సహజ లక్షణం, కాటు వేయడం పాము నైజం. చిచ్చు ఒడిని గట్టుకుంటే కాలకుంటుందా? మూర్ఖునికి చెవినిల్లు కట్టుకొని పోరినా అతనిలో సంస్కారం ఉదయించడం దుర్లభమని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు.

' పాలు బంచదార పాపర బండ్లలో

   చాలబోసి వండ జవికి రాదు
   కటిల మానవులకు గుణమేల కలుగురా'అంటాడు వేరొక పద్యంలో వేమన.
   మన పడతులు కాకరగాయ వంటకంలో కొంచెం బెల్లం కలుపుతారు. ఇంతకన్నా కటిక చేదు ఫలాలు ప్రకృతిలో ఉన్నాయి. పాలు, పటికె బెల్లం కటలబోసి వండినాఅటువంటి కాయల్లో చేదు విరగదు.అలాగే మూర్ఖులకు చేసే,హితబోధ కంఠశోష మాత్రమే తెన్తుంది అని ఈ సామెతల నుండి గ్రగించవచ్చు.
                       93