పుట:Bible Sametalu 2.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుగుబాటు దారుగా ముద్రవేశారు. చెక్క, లవంగాలు, కుంకుమపువ్వు, కర్పూరం కలిపిన మంచి బెల్లపు పాకాన్ని కలియబెట్టే తెడ్డుకు పాకం రుచి తెలియదు గదా. కుడుతి త్రాగే ఎద్దుకు కమ్మని అటుకులు నెయ్యితో దోరగా వేయించి కొత్తిమీర, జీడిపప్పు కలిపి తినిపిస్తే లొట్టలు వేస్తూ తింటుందా? అధములు ఉదాత్తమైనవాటి ఉత్కృష్టతను గ్రహింపలేరు అనే సార్వత్రిక నత్యాన్ని తెలుగు సామెత ఒకింత ,హాస్యోక్తిగా వినిపిన్తున్నది.

 ' కుక్క యేమెరుంగు గురులింగ జంగంబు
   పిక్కబట్టి యొడసి పీకుగాక
   సంతపాకతొత్తు నన్న్యాసి నెరుగునా'
   అంటూ వేమన సైతం చమత్కరించాడు. అతడెంత యోగి పుంగవుడో, గురులింగడో, లఘు లింగడో ఊరకుక్కకేమి తెలును? అపరిచితులుగా తోచినవారి మీద కెగబడి కరిచి వదులుతుంది. నముద్రంలో కలిసిన నీటిబొట్టు ఉనికి లేకుండా అంబుధిలో కలిసిపోతుంది; స్వాతి చినుకు ముత్యపు చిప్పలో పడితేనే గదా నవమౌక్తికమయ్యేది.
   మూర్ఖునికి ఎంతటి దివ్యోపదేశం చేనినా ఫలితముండదు. అది సూకరాల ఎదుట ముత్యాలు వేసినట్టే కారడవిలో శశికళలు వెల్లివిరిసినట్టే. అపాత్రదానం మహా పాపం. ఎవరికేది తగునో దానినిచ్చి ఊరుకోవడం ఉత్తమం. ఔచిత్యం ప్రధానం. ఈ అభిప్రాయాన్నే తెలుగు, బైబులు సామెతలు వెలిబుచ్చుతున్నాయి.

' గాడ్దె యేమెరుంగు గంధంపు వానన

   కుక్క యేమెరుంగు ఒక్క ప్రొద్దు
   అల్పుడేమెరుంగు హరుని గొల్చు విధంబు' అన్న వేమన దీనినే                వివరిన్తున్నాడు.
                     9

తెలుగు సామెత : తేనె పోసి పెంచినా వేపకు చేదు పోదు బైబులు సామెత : మూర్ఖునికి బోధింపగోరి పలుకులను వ్యర్థము చేసికొనవలదు

          (సామెతలు 23:9)
                            92