పుట:Bible Sametalu 2.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూర్ఖుని మార్గం వాని దృష్టీలో నరియైనదే. ఎన్ని చెప్పినా దాన్ని వాడు విడిచి రాడు. ఒకని మార్గం వానికి నరియైనదిగానే కటనిపిన్తుంది అని చెప్పడంలో బైబులు సామెత పరిధి మూఢ చిత్తుల చపల వర్తనకు పరిమితమయింది. తెలుగు సామెతలో కుడా ఇదే భావమున్నప్పటికీ నైతికగా తటన్థ ధోరణిని, చర్యలను కుడా ఇది ఉద్దేశిన్తున్నది. లోకోభిన్న రుచిః అన్నట్టు ఎవరి ఇష్టాయిష్టాలు వారికటుంటాయి. కాని అవి మాత్రమే ఒప్పు అనుకోవడం తప్పు.

      ఎవరు చెప్పినా వినకుందా తన ఉన్మాద చర్యలతో, మూర్ఖ క్రియలతో, దుర్మార్గంతో ప్రవర్తిల్లేవారి విషయంలో వినుగు చెంది విజ్ఞులు అనే మాటలే ఈ రెండు సామెతలూ. అలాటివారిని వారి మొండితనం నుండి మరలించడానికి శతవిధాల ప్రయత్నించి వాడి ఖర్మకు వాడిని వదిలివేనే నమయంలో ఇలా నరిపెట్టుకోవడం పరిపాటి. అందుకే
         ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని
         హీను డవగుణంబు మానలేడు
         బొగ్గు పాల గడుగ పోవునా మలినంబు? అంటాడు వేమన         
                         8

తెలుగు సామెత : తెడ్డుకేమి తెలుసు కురల రుచి? ఎద్దుకేమి తెలును అటుకుల రుచి? బైబులు సామెత : మూఢుని యెదలో జ్ఞానము నిలువదు (సామెతలు 14:33)

  వ్యోమ సింహాసనం వీది దేవదేవుడు యేనుక్రీన్తు ఏ దేశాన మరియా తనూజుడై అవతరించి తన బోధనామృతాన్ని ధారలుగా ప్రవహీంపజేశాడో ఆ దేశపు కొండ గట్టుల మీదనే ఆయన రకట్తపుటేరులు పారించారు ఆయన న్వజనం.దీని గురించి వ్యాఖ్యానిన్తూ 'ఇందేదో వేద రహన్యమున్నది యది తండ్రీ' అంటూ జాషువా వాపోయాడు 'క్రీన్తు' అనే ఖండకావ్యములో. జరిగినదేమిటంటే ఆయన తాను దైవ కుమారుడినంటూ తన అవతార పరమార్థాన్ని విశదపరున్తుంటే దైవ దూషణ చేశావంటూ యూదులు ,హుంకరించారు. దురిత విష సర్పపు పడగ నీడ నుండి తప్పించి న్వేచ్ఛామార్గంలోకి నడిపిస్తానంటే దొరతనం వారైన రోమీయులపై
                         91