పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తల్లిదండ్రులను గౌరవంతో చూడాలని చెపూ తోబీతు తోబియాకు ఇట్ల బోధించాడు. "నాయనా! నేను చనిపోయినప్పడు నన్ను అన్ని మర్యాదలతో పాతిపెట్టు, నేను దాటిపోయిన తర్వాత మీయమ్మను గౌరవంతో జూడు. ఆమె బ్రతికియున్నంతకాలం ఆమెను పోషించు. ఆమె చనిపోయినపుడు నా ప్రక్కనే పాతిపెట్టు, నిన్ను గర్భాన మోసి కనినపుడు ఆమె యెన్ని అపాయాలకు గురైందో జ్ఞప్తికి తెచ్చుకో. కనుక ఆమె కోరినదెల్ల చేయి. ఎన్నడూ నీ తల్లి మనసు కష్టపెట్టకు" - తోబీ 4,3-4.

మాతాపితలనులాగే వృద్దులనూ జ్ఞానులనూగూడ గౌరవించాలి, వారి బోధలను శ్రద్ధతో వినాలి.

వృద్దుని చిన్నచూపు చూడవదు
మనమందరం ముసలివాళ్ల ఔతాంగదా!
విజ్ఞల బోధను అనాదరం చేయవద్దు
వారి సూక్తులను జాగ్రత్తగా పఠించు
వాటి వలన నాగరికత అలవర్చుకొని
రాజులకు సేవలుచేసే విధానం నేర్చుకొంటావు
పెద్దవారి ఉపదేశాలను అనాదరం చేయవద్దు
వారు తమ పూర్వులనుండే వాటిని నేర్చుకొన్నారు
వారినుండి నీవు విజ్ఞానాన్ని గడిస్తావు
అవసరం వచ్చినపుడు జవాబు ఏలా చెప్పాలో
తెలిసికొంటావుగూడ - సీరా 8,6. 8–9.
యాజకులనుగూడ మన్ననతోజూచి వారి కీయవలసిన కానుకలను ఈయాలి.
దేవునికి భయపడే యాజకులను గౌరవించు
విధ్యుక్తంగా వారికీయవలసిన కానుకలు ఈయి
ప్రధమ ఫలాలు, బల్యర్పణం, పవిత్రార్పణం ఈయి - సీరా 7.21.

వైద్యులద్వారా, వారిచ్చే మందులద్వారా ప్రభువే వ్యాధులు నయం చేస్తాడు. కనుక వారిని సన్మానించాలి.

నీకు చికిత్స చేసినందుకు వైద్యుని సన్మానించు
ప్రభువే అతన్ని కలిగించాడు
వైద్యులద్వారా మహోన్నతుడే వ్యాధినయంచేస్తాడు
రాజులు ఆ వైద్యులను బహూకరిస్తారు