పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రిని గౌరవించేవాడు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొన్నట్లే తండ్రిని సన్మానించేవాడు నిధిని చేకొన్నట్లే తల్లిని సన్మానించే పుత్రుడ్డి అతని పుత్రులు సంతషపెడతారు అతని ప్రార్థనను దేవుడు ఆలిస్తాడు తండ్రిని ఆదరించేవాడు దీర్గాయుష్మంతుడౌతాడు తల్లిని సంతోషపెట్టేవాడు దేవునికి విధేయుడైనట్లే తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహాలు వృద్ధిచెందుతాయి తల్లి శాపాల వలన పిల్లల కొంపలు కూలిపోతాయి పూర్ణహృదయంతో నీ తండ్రిని గౌరవించు నిన్ను కన్నతల్లి పురిటి నొప్పలను మరచిపోకు నీకు ప్రాణమిచ్చినవాళ్ళ నీ జననీజనకులు వాళ్ళ ఋణాన్ని నీవెట్ల తీర్చుకొంటావు? నీవు జనులమధ్య కూర్చుండివున్నపుడు మైమరచి కామపమాటలుపల్కినీయవివేకాన్ని చాటుకోవచ్చు ఆ సంగతి వింటే నీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో వూహించు - సీరా 3,3-6,9, 7, 22-28, 23, 14 విశేషంగా ముసలివారైన తల్లిదండ్రులను ఎంతో ఆదరంతో జూడాలి. నాయనా! వృద్దుడైన నీ తండ్రిని బాగుగా జూచుకో అతడు జీవించివున్నంతవరకు అతన్ని కష్టపెట్టకు అతనికి మతి దప్పినా నీవతన్ని ఆదరంతో జూడు నీవు బలంగాను ఆరోగ్యంగాను వున్నావు కనుక అతన్ని ఆలక్ష్యం చేయకు నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు ఆ కరుణ నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిపెడుతుంది తల్లిదండ్రులను శపించేవాని దీపం నడిచీకటిలో ఆరిపోతుంది - సీరా 3,12- 14,సామె 20, 20,