పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువే భూమినుండి మందులు కలిగించాడు బుద్ధిమంతుడు వాటిని తప్పక వినియోగించకుంటాడు కుమారా! నీకు జబ్బుచేస్తే అశ్రద్ధ చేయకు ప్రభుని వేడుకొంటే నీకు ఆరోగ్యం దయచేస్తాడు. నీ తప్పిదాలను విడనాడి నిర్దోషివి కా నీ హృదయంనుండి పాపాన్ని నిర్మూలించు అటుపిమ్మట వైద్యుని పిలువ ప్రభువే అతన్ని కలిగించాడు నీ కవసరంవుంది కనుక అతన్ని నీ చెంతనే వుంచుకో ఒక్కోసారి నీ యారోగ్యం అతని చేతిలో వుంటుంది అతడు తాను రోగిబాధలను తొలగించి వ్యాధిని కుదిర్చి ప్రాణాలు నిల్పడానికి శక్తిని దయచేయమని దేవుని ప్రార్ధిస్తాడు సృష్టికర్తకు ద్రోహంగా పాపంచేసిన నరుడు రోగియై వైద్యుని ఆశ్రయించడం న్యాయం - సీరా 38, 1-4, 9 - 25 ఆలాగే మంచివాడు అధికారంలో వున్న వారికి లొంగివుండాలి. నీవు భక్తసమాజం మన్నన పొందు అధికారంలో వున్నవారికి తలవొగ్గు - సీరా 47.

14. మంచి సలహాను పాటించాలి

మంచి సలహావల్ల చాల లాభాలున్నాయి. కనుక మనం దాన్ని పాటించాలి. మన హృదయంకూడ మనకు సలహా యిస్తుంది. బుద్ధిమంతుడు ఇతరుల అభిప్రాయాలను వింటాడు కాని భక్తిహీనులైన గర్వాత్ములు దేనికీ జంకరు ఎవడైనా ఉపదేశం చేయగలడు కొందరు స్వలాభం కొరకే సలహా యిస్తారు సలహాయిచ్చే వానిని జాగ్రత్తగా పరిశీలించిచూడు అతని కోరిక యేమిటో తెలిసికో అతడు స్వార్ణాన్ని ఆశిస్తూండవచ్చు కడన నీకు అపకారం తలపెట్టవచ్చు

                                     92