పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుణ్ణి నీ కార్యక్రమాలను దీవించమని వేడుకొంటే
 నీకు తప్పక విజయం కలుగుతుంది
 నీకున్న సిరిసంపదలతో దేవుణ్ణి పూజించు
 నీకు పండిన పంటలో మొదటిపాలు అతని కర్పించు
 నరుణ్ణీ నడిపించేవాడు ప్రభువే
లేకపోతే మనుజునికి త్రోవ యేలా తెలుస్తుంది?
 - సామె 16, 1. 9. 19,21. 2.81. 16,8.8,8. 20,24

నరుడు దేవుణ్ణి నమ్మిజీవించాలి. మేలూ కీడూ కూడ అతనినుండే వస్తాయి. మన పనుల్లో దేవుణ్ణి నమ్మకొంటే అతడు వాటిని సులభం చేస్తాడు. నరుడు ప్రభువు శిక్షను మనస్పూర్తిగా అంగీకరించాలి. అతనిపట్ల భయభక్తులు కలిగి జీవించాలి. ప్రభువు దివ్యనామమనే కోటలో దాగుకోవాలి.

ఒకడు బానిసలా శ్రమించి పనిచేసినా
ఎల్లప్పడూ వెనుకబడుతూనే వుంటాడు
మరొకడు తెలివితక్కువవాడు,
అన్యుల సాయం కోరేవాడు,
శక్తిలేనివాడు, పరమదరిద్రుడు కావచ్చు
కాని ప్రభువు వాణ్ణి కరుణతో వీక్షించి
దీనావస్థ నుండి ఉద్ధరింపవచ్చు
అప్పడతడు మళ్ళా ఔన్నత్యాన్ని పొందడంజూచి
అందరూ ఆశ్చర్యచకితు లౌతారు
మేలు కీడు, బ్రతుకు చావు, కలిమి లేమి
అన్నీ దేవునినుండే వస్తాయి
భక్తుడు దేవుని దీవెననే బహుమతిగా పొందుతాడు
ఆ దీవెన క్షణకాలంలోనే సత్ఫలితాన్నిస్తుంది.
నీ కార్యాలన్నిటిలో ప్రభువుని స్మరించుకో
అతడు నీ పనులను సులభతరం చేస్తాడు
కుమారా! ప్రభువు శిక్షణను తృణీకరించవద్దు
అతని మందలింపులను అశ్రద్ధ చేయవద్ధు
తండ్రి తన కిష్టుడైన కుమారుణ్ణీ శిక్షించినట్లే
ప్రభువు తనకు ప్రీతిపాత్రుడైన నరుణ్ణి చక్కదిద్దుతాడు.
                                            

                                     81