పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధ్యాహ్నపు వేడినుండి కాపాడతాడు
వారిని కాలుజారి పడనీయడు, నాశమైపోనీయడు
వారికి సేదదీర్చి
వారి కన్నులలో కాంతిని నెలకొల్పుతాడు
ఆయురారోగ్యాలతో వారిని దీవిస్తాడు
ధనబలాల వలన ఆత్మవిశ్వాసం కలుగుతుంది
కాని ఆ రెండిటికంటె దైవభీతి మేలు
దైవభీతి కలవారికి వేరేమి అక్కరలేదు
ఇతరాధారాలేమీ అవసరంలేదు
దైవభీతి నానా లాభాలొసగే ఉద్యానవనం లాంటిది
దానికి మించిన సదాశ్రయం లేదు
దైవభక్తిలేని బిడ్డలు ఎంతమంది వున్నా
వారిని జూచి సంతృప్తి చెందవద్దు
ఆ బిడ్డల భవిష్యత్తు శుభప్రద మౌతుందనీ
వాళ్ళ దీర్ఘకాలం జీవిస్తారనీ ఆశింపవద్దు
వేయిమంది పుత్రులకంటె ఒక్కడు మెరుగు
భక్తిహీనులైన బిడ్డలను కనడంకంటె
అసలు బిడ్డలు లేకుండ చనిపోవడం మేలు

-సీరా 2, 1-3. 15, 13-17. 18,24. 34, 13-17. 40, 26-27. 16, 2-3. మన పథకాలు మనకుండవచ్చుగాక, వాటిని సఫలం చేసేవాడు మాత్రం ప్రభువే. అతని దీవెన వల్లనే మనం విజయం పొందుతాం. ఈ జీవితంలో మనలను నడిపించేది అతడే.

నరుడు పథకాలను సిద్ధంచేసికోవచ్చగాక
ప్రత్యుత్తర మిచ్చేది మాత్రం ప్రభువే .
నరుడు పథకాలను సిద్ధంజేసికోవచ్చుగాక
అతని కార్యక్రమాలను నడిపించేదిమాత్రం ప్రభువే .
నరుడు ప్రణాళికలను వేసికోవచ్చుగాక
దేవుని సంకల్పం నెరవేరి తీరుతుంది.
నరుడు గుర్రాన్ని యుద్దానికి సిద్ధంచేయవచ్చుగాక
విజయాన్ని ఒసగేది మాత్రం ప్రభువే.