పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవునిపట్ల భయభక్తులు కలవానికి చీకుచింత లేదు
అతని సంతతినిగూడ ప్రభువే రక్షిస్తాడు
దైవభయం జీవజలధారవంటిది
దానివలన మృత్యుపాశంనుండి తప్పించుకోవచ్చు.
ప్రభువు దివ్యనామం కోటలాంటిది
పుణ్యపురుషులు దానిలో ప్రవేశించి
రక్షణం పొందుతారు

ధనవంతులు మాత్రం తమ సంపద తమ్ము ఉన్నతమైన ప్రాకారంవలె సంరక్షిస్తుందని బ్రాంతి పడతారు - సీరా 11, 11-14.22. సామె 3,6. 11-12. 14, 26-27. 18, 10-11

10. ఆత్మగౌరవాన్ని కాపాడుకో

నరుడు తన్నుతాను తక్కువగా ఎంచుకొని ఆత్మగౌరవాన్ని చెడగొట్టుకోగూడదు. తన్ను తాను నిందించుకోగూడదు. మాటామాటికి పొరుగువారి యింటికిబోయి చులకన కాగూడదు.

కుమారా! నీకు లభించిన అవకాశాలను
సద్వినియోగం జేసికో
కాని దుష్కార్యాలకు పూనుకోకు
నిన్నుజూచి నీవే సిగ్గుపడకు
వినయవర్తనం గౌరవాన్ని కీర్తిని తెచ్చిపెడుతుంది
కాని తన్నుతాను తక్కువగా ఎంచుకోవడం పాపహేతువు
ఇతరులపట్లగల మోజుచే
నీయాత్మ గౌరవాన్ని చెరచుకోవద్దు
నీ హక్కుని వదలుకొని స్వీయనాశాన్ని తెచ్చుకోవద్దు
కుమారా! ఆత్మాభిమానమూ వినయమూ కలిగివుండు
నీకు తగినట్లుగానే నిన్నునీవు గౌరవించుకో
తన్ను తాను నిందించుకొంటే ప్రయోజనం లేదు
ఆత్మగౌరవం లేనివాణ్ణి ఇతరులు గౌరవిస్తారా?
తేనెనుగూడ మితంమీరి భక్షింపరాదు
భక్షిస్తే వాంతి ఔతుంది

82