పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నిటికంటె ముఖ్యంగా

నీ హృదయాన్ని పదిలం చేసికో

నీ జీవనగతికి ఆకరమదే

వెండి బంగారాలను కుంపటి పరీక్షిస్తుంది - సామెతలు 4, 23, 20,27

3. దయ

నరునికి దయాగుణం ఎంతో అవసరం. దయాపరుడు తన బానిసనుగూడ సొంత సోదరునిలా చూస్తాడు. తన భోజనాన్ని పేదలకు వడ్డిస్తాడు. {{center|

భక్తహీనుల పుత్రులకు పెద్ద కుటుంబాలు కలగవు

వాళ్ళు రాతిమీద మొలచిన మొక్కల్లాగ క్షీణిస్తారు

ఏటి వొడ్డున ఎదిగే తుంగ అన్నిటికంటె ముందుగా

కోసివేయబడినట్లే వాళ్ళూ నాశమౌతారు

కాని కరుణ భాగ్యవనం లాంటిది

దానం శాశ్వతంగా నిలుస్తుంది - సీరా 40 : 15-17

మంచివాడు తన దాసునిగూడ కరుణతో జూస్తాడు

నీ బానిసను నీవలె చూచుకో

వాణ్ణి నీ కష్ణార్జితంతో కొనితెచ్చుకొన్నావుకదా!

అతన్ని నీ సోదరునివలె చూచుకో

నీవు నీకెంత అవసరమో వాడూ నీకు అంత అవసరం - సీరా 33,30-31

ఇంకా ఈ సందర్భంలో సామెతల గ్రంథం ఈలా వాకొంటుంది

తన భోజనాన్ని పేదలకుగూడ వడ్డించే కరుణామయుడు

దేవుని దీవెనలు పొందుతాడు

ప్రభువు పేదలకోపు తీసికొని

వాళ్ళను పీడించేవాళ్ళను పీడిస్తాడు - 22, 9.23.

4. దానం

దానం, ఉపవాసం, ప్రార్ధనం యూదుల భక్తికి మూలస్తంభాల్లాంటివి. ప్రస్తుతం వీటిల్లో దానాన్నిగూర్చి చూద్దాం. తోబీతు తన కుమారుడు తోబియాకు ఈలా చెప్పాడు. "నాయనా! దేవునిపట్ల భయభక్తులు చూపేవారికి నీ సాత్తునుండి దానధర్మాలు చేయి. నీవు పేదలను అనాదరం చేయకుంటే దేవుడు నిన్ను అనాదరం చేయడు. నీకున్న దానినిబట్టి