పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీవు దానంచేయి. నీకు ఎక్కువగావుంటే ఎక్కువగానే ఈయి. తక్కువగావుంటే తక్కువగానే ఈయి. ఈయడంలో మాత్రం ఎప్పడూ వెనుకాడకు. ఇచ్చిన ఈవి ఆపత్కాలంలో పెద్ద నిధిలా సాయపడుతుంది. దానం మోక్షంలోని దేవునికి ఇష్టమైన కాన్క కనుక దానం చేసేవాణ్ణి అతడు అంధకారబంధురమైన మృత్యులోకాన్నుండి రక్షిస్తాడు” - తోబీతు 4,7-11. పేదలకు దానం చేయడంలో ఆలస్యం పనికిరాదు. పేదవానికి మరల రేపురా అని చెప్పకూడదు. దరిద్రుడు ధనికునిముందు మొరపడి అతన్ని శపిస్తే ఆ మొరను దేవుడు వింటాడు

నీకు శక్తివుంటే

ఇతరులు అడిగిన వుపకారం తప్పక చేసిపెట్టు

పొరుగువాడికి సత్వరమే

సాయంచేయగలవేని చేసిపెట్టు

{[center

నిరాశ చెందివున్నవాని బాధలు అధికం చేయకు

అతడు చేయిచాచి అడిగితే జాప్యం చేయకు

బిచ్చగాడు యాచించినప్పడు నిరాకరించవద్దు

పేదవానినుండి మొగం ప్రక్కకు త్రిప్పకోకు

దరిద్రునినుండి నీ చూపు మరల్చకు

అతడు నిన్ను శపించకుండా వుండేలా చూచుకో

హృదయవేదన భరింపజాలక

ఆ దరిద్రుడు నిన్ను శపిస్తే

ప్రభువు అతని మొర ఆలిస్తాడు - సీరా 4,3-5

పేదలకు చేసిన దానం ప్రభువుకి చేసినట్లే అతడు ఆ సొమ్మని మనకు వడ్డీతోసహా చెల్లిస్తాడు. ఇది చాల మంచి భావం.

పేదలను ఆదుకొంటే ప్రభువుకే అప్పిచ్చినట్లు

ఆ యప్పను అతడు తప్పక తీరుస్తాడు - సామె 19, 17.

దానమనేది పేదలకు అన్నంపెట్టడం, బట్టలీయడం, చనిపోయినవారిని పాతిపెట్టడం అని చాల రకాలుగా వుంటుంది. తోబీతు ఈలా చెప్పకొన్నాడు. "షల్మనేసరు బ్రతికివున్నకాలంలో నేను మా జాతివారికి పెక్కుదానధర్మాలు చేసాను. వాళ్ళ ఆకలిగొనివస్తే నేను భోజనం పెట్టేవాడ్డి బట్టలులేనివారికి బట్టలిచ్చేవాణ్ణి. నీనివే పౌరులు మా జాతివారి శవాలను పట్టణ ప్రాకారం, వెలుపల పారవేస్తే నేను వారిని పాతిపెట్టేవాణ్ణి - తోబీ 1,16-17.