పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలైనవి సంతోషంతో ప్రభువు ఆజ్ఞ పాటిస్తాయి
అవి ప్రభువుని సేవించడానికి సిద్ధంగా వుంటాయి
సత్వరమే అతని ఆజ్ఞను నెరవేరుస్తాయి - సీరా 39, 29-31

ఎంత కీడుకి అంత శిక్ష అంటియోకసురాజు యూదులకు బద్ధశత్రువు. అతడు యూదులను హింసించడానికి యెరూషలేము వెళూంటే దారిలో దేవుడే అతన్ని హింసించాడు. "అంటియోకసురధాన్ని ఎక్కడా ఆపక ఎకాయెకిని యెరూషలేమకి తోలమని సారధిని ఆజ్ఞాపించాడు. నేను యెరూషలేము చేరగానే ఆ నగరాన్ని శ్మశానంగా మారుస్తానని మహాగర్వంతో శపథం చేసాడు. కాని ప్రభువు శిక్షకూడ తన వెంటనే వస్తూందని అతడు గ్రహించలేదు. అంటియోకసు పై మాటలు పలకగానే అన్నిటినీ గమనించే యిప్రాయేలు దేవుడు అతన్ని ఏదో గుర్తుతెలియని మహా రోగంతో పీడించడం మొదలెట్టాడు. అతని ప్రేగుల్లో ఫనోరమైన బాధ పుట్టింది. ఆ బాధకు ఉపశాంతిలేదు. అనేకుల కడుపుకి చిచ్చుపెట్టినవానికి ఈ కడుపునొప్పి ఉచితమైన శిక్షేకదా!" - 2 మక్కబీయులు 9, 4-6, కొంతమంది దేవుడే నరులచేత పాపం చేయిస్తాడనీ నరులకు స్వేచ్చ లేదనీ అనుకొంటారు. కాని ఇది పొరపాటు.

 
నేను పాపం చేయడానికి దేవుడే కారణమని చెప్పకు
తాను అసహ్యించుకొనేదాన్ని దేవుడేలా చేయిస్తాడు
దేవుడు నన్ను పెడత్రోవ పట్టించాడు అనకు
అతడు పాపాత్ముల్ని తనపనికి వాడుకోడు - సీరా 15, 11-12

మంచిని చేయడానికీ చెడ్డను మానుకోడానికీ గూడ నరునికి స్వేచ్చ వుంది. కనుక అతని పాపానికి అతడే బాధ్యుడు.

భగవంతుడు ఆదిలో నరుని చేసినప్పడు
అతనికి తన నిర్ణయాలు తానే చేసికొనే స్వేచ్ఛనిచ్చాడు
నీవు కోరుకొంటే ప్రభువు ఆజ్ఞల్ని పాటించవచ్చు
అతన్ని అనుసరించాలో లేదో నిర్ణయించేది నీవే
ప్రభువు నిప్పూ నీళ్ళూగూడ నీముందు వుంచాడు
చేయి చాచి వీటిల్లో నీ కిష్టమొచ్చినదాన్ని తీసికో
మృత్యువు జీవంకూడ నరుని ముందట వున్నాయి
అతడు తాను కోరుకొన్నది తీసికోవచ్చు - సీరా 15, 14-17

పాపపుణ్యాల విషయం వచ్చినపుడు మన హృదయం ముఖ్యం. కీలకమంతా దానిలోనే వుంటుంది.