పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రత్యక్షమౌతుంటుంది. వాళ్ళను తన పచ్చడం క్రింద కాచికాపాడుతూంటుంది. రోజురోజు మరియ మనకు చేసే సహాయమే, మనకిచ్చే రక్షణమే ఆమె సాన్నిధ్యానికి నిదర్శనం. కనుక మరియ తాను జీవించినపుడు ఆనాటి స్త్రీ పురుషులతో ఏలా తిరుగాడిందో ఈనాడు తన భక్తులతోను అలా తిరుగుగాడుతూంటుంది. ఆ పునీత హృదయ సాన్నిధ్యాన్ని మననం చేసికొంటూ పాపాన్ని జయించవచ్చు. దివ్యజీవితం జీవించవచ్చు.

మరియకు అంకితమైన గుళ్ళకు వెళ్ళి ఆమెను కొనియాడ్డం కూడ ఓ భక్తిమార్గం. ఆ తల్లి పేర ప్రదక్షిణలు జరుపవచ్చు. ఆమె దర్శనమిచ్చిన పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు. స్మరించవచ్చు. ఈ సందర్భములో విశేషంగా లూర్ధుమాతగుహను పేర్కొనాలి. ఫ్రాన్సునందలి లూర్ధునగర గుహను సందర్శించలేకపోయినా, మన వూళ్ళలో నమూనాగా కట్టుకునే లూర్ధుగుహ యెదుట భక్తిని ప్రదర్శించవచ్చు. మన వూరి గుహ యెదుటనే నిలుచుండి ఆనాడు మరియ బెర్నెదత్తుకిచ్చిన దర్శనాన్నిస్మరించుకొని మన పాపాలకు పశ్చాత్తాపపడి, మన అవసరాలను ఆ తల్లికి విన్నవించుకోవచ్చు.

మరియమాతనుగూర్చిన బైబులు వాక్యాలను చదువుకొని మననంజేసికొంటూ ప్రార్థించుకోవడంగూడ.ఓ చక్కని భక్తిమార్గం. మరియు తాను స్వయంగా మననశీల - లూకా 2,18. సువిశేషకారులు ఆమెను పరమ పవిత్రమూర్తినిగా చిత్రించారు. మరియను ప్రస్తావించే సువిశేష వాక్యాలను ధ్యానించుకొనేవాళ్ళ హృదయం అనతికాలంలోనే భక్తి భావంతో నిండిపోతుంది.

మంచిమరణం దయచేయమనిగూడ మనం ఆ తల్లిని వేడుకొంటూండాలి. ఆమె మన రక్షణాన్ని కోరుకొంటుంది. కనుక ఈ భాగ్యాన్ని తప్పక ప్రసాదిస్తుంది. మంగళవార్త జపం రెండవభాగంలో శ్రీసభ ఈ మనవి చేర్చింది.

వేదశాస్త్రజ్ఞలు చాలామంది "మరియమాత భక్తులు నరకానికి పోరు, తప్పకుండ రక్షణం పొందుతారు" అని నుడివారు. అల్ఫోన్సస్ లిగొరి అనే భక్తుడు తాను వ్రాసిన మరియమాత మహిమలు అనే ఉద్ర్గంథాన్ని "మరియమాత భక్తులకు చేటులేదు" అంటూ ముగించాడు. ఈలాంటే, మనం పాపజీవితం జీవించినా మరియ మనలను అద్భుతంగా మోక్షానికి తీసికొని వెళ్తుందని భావం గాదు. ఆమె తన భక్తులు పాపపు బురదలో అడుగు పెట్టకుండా వుండేలా తోడ్పడుతుంది. ఒకవేళ బలహీనతవల్ల పాపంలో కూలిపోయినటైతే, వాళ్ళకు పశ్చాత్తాపం పట్టించి ఆ బురదలోనుండి వెలుపలకు లాగుతుంది. వాళ్ళకు మంచి మరణం అనుగ్రహిస్తుంది. ఈ సత్యం మనకెంతైనా సంతోషాన్నీ ఉత్సాహాన్నీ కలిగించాలి. తల్లిలేని పిల్లలు దిక్మూమొక్కూలేక బావురు మంటూంటారు. తల్లిగల పిల్లలకు అన్ని హంగులూ అమరుతాయి. మరియమాతను తల్లిగా అంగీకరించి ఆమెపట్ల