పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భక్తిభావంతో చరించేవాళ్ళ భాగ్యం అంతింతగాదు. ఆమెను తల్లిగా అగీకరించనివాళ్ళ దౌర్భాగ్యమూ అంతింతగాదు.

ఇక, మరియమాతపట్ల చూపే భక్తిక్రియలన్నిటిలోను హృదయం ప్రధానం. అనగా నిండు హృదయంతో ఆ తల్లిని పూజించాలి. ఈలా పూజించాలంటే మన రక్షణ చరిత్రలో ఆమె నిర్వహించిన పాత్రను చక్కగా అర్థంచేసికొనివుండాలి. ఆమె దేవమాత, సహరక్షకి. ఈ రెండు బిరుదాలను అర్థంజేసికున్నవాళ్ళ ఆమె స్థానమేంటో వెంటనే గ్రహిస్తారు. "హృదయంలో భక్తి లేకుండా బయటకు మాత్రమే భక్తిక్రియలు చూపెడుతుంటే అవి కేవలం మూధాచారాలే ఔతాయి. ఈ సందర్భంలో "భక్తి గలుగుకూడు పట్టెడైనచాలు" అనే వేమనవాక్యం స్మరింపదగ్గది.

ఇంకో విషయంగూడ. మనం దేవుణ్ణి పూజిస్తాం, ఆరాధిస్తాం. సృష్టి ప్రాణులైన పునీతులు దేవదూతలు మొదలైన వాళ్ళను ఆరాధించం, పూజిస్తాం. ఇక మరియమాతను పునీతుల కంటె అధికంగా పూజిస్తాం. కాని ఓ దేవుణ్ణి ఆరాధించినట్లు ఆరాధించం.

మరియను పూజించడంలో ప్రధానోద్దేశం, దేవుడు ఆమెకు అనుగ్రహించిన భాగ్యాలను స్తుతించడమే. ఆమె అంది "ఇకమీదట సకల తరాలవాళ్ళ నన్నుధన్యురాలినిగా భావిస్తారు. ఎందుకంటే దేవుడు నాకు మహత్తర కార్యాలు చేసాడు" అని. ఆలాగా దేవుని మహత్తర భాగ్యాలను పొందిన తల్లిని మనం స్తుతించవద్దా? ఆమె ధన్యురాలని ఎలుగెత్తి చాటవద్దా? మరియను పూజించడమంటే దేవుణ్ణి అతని క్రీస్తుని ఆరాధించడమే. ఓ పునీతురాలియందు ప్రతిఫలించిన ఆ ప్రభువు వరాలను కొనియాడ్డమే. అసలు పునీతులందుకూడ దేవుణ్ణి మహిమ పరుస్తుంటాంగదా? మరియకు భక్తి చూపే వాళ్ళు ఆ తల్లి పట్ల బిడ్డల్లాగ ప్రవర్తిస్తున్నారని రుజువు చేసికొంటారు. మరియ భక్తి యథార్థ క్రైస్తవ జీవితానికి కొలకర్ర, జీవగర్ర.

11. ఆదర్శ మాత

పూర్వాధ్యాయంలో మరియమాతపట్ల చూపవలసిన భక్తిని గూర్చి ముచ్చటించాం. మరియ క్రైస్తవులకు ఆదర్శంగా వుంటుంది. క్రైస్తవ సమాజంలోని గురువులూ మఠకన్యలూ గృహస్థులూ ఆమెను ఆదర్శంగా బెట్టుకుని జీవిస్తుంటారు. అదేలాగో మూడంశాల్లో పరిశీలించి చూద్దాం.

1. మరియ గురువులకు ఆదర్శం

మరియ గురువుల మాత. ఆమె గురుపట్టమనే దేవద్రవ్యానుమానం పొందలేదు. ఆ తల్లి గురుత్వం విశ్వాసుల గురుత్వానికి చెందింది. ఆ పునీతురాలు క్రీస్తు గురువుని