పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరించే స్థలానికి కాలం లేనట్లే అక్కడ అగ్నిగూడ ఉండదు. ఉత్థానక్రీస్తే అక్కడ మన జ్యోతీ మన అగ్నీఐ మనలను శుద్ధిచేస్తాడు. నూత్నవేదం అతన్ని జ్యోతి అని పిలుస్తుంది —యోహా 1,9. అగ్ని అని కూడ పిలుస్తుంది - దర్శ 1,14.

      ఇంతవరకూ ఉత్దాన క్రీస్తుద్వారా మనం శుద్ధిని పొందే తీరును చూచాం. ఇక పవిత్రాత్మద్వారా ఏలా శుద్ధిని పొందుతామో పరిశీలిద్దాం.
        పవిత్రాత్మ చావైన పాపమూ ఒకేసారి నరుల హృదయాల్లో వసింపవు. కాని పవిత్రాత్మా పాపాభిలాషా ఒకేసారి హృదయంలో ఉండవచ్చు. క్రైస్తవుడు మొదట పాపంతోను పాపాభిలాషతోను పుడతాడు. తర్వాతనే పవిత్రాత్మను పొందుతాడు. మన హృదయంలో పాపాభిలాషా పవిత్రాత్మా అనే ఇద్దరు అతిథులూ ఒకరిప్రక్కన ఒకరు జీవిస్తుంటారు. మన జీవితాంతమూ ఈ రెండు శక్తులూ మనలను పరస్పర విరుద్ధమైన రెండు విభిన్న మార్గాల్లోనికి లాగుతూంటాయి. దీనివల్ల మన హృదయంలో ఈ ఘర్షణ యేర్పడుతుంది. కాని మరణ సమయంలో ఈ ఘర్షణం అంతరిస్తుంది. అప్పడు పాపాభిలాష పవిత్రాత్మకు పూర్తిగా లొంగిపోతుంది. ఆ చివరిక్షణంలో మనం పాపవాంఛలు వదలించుకొని పూర్తి పావిత్ర్యాన్ని పొందుతాం.
       మెస్సీయానుగూర్చి చెపుతూ స్నాపక యోహాను "నా తర్వాత వచ్చేవాడు మిమ్మ పవిత్రాత్మతోను అగ్నితోను స్నానం చేయిస్తాడు" అని చెప్పాడు - మత్త 3,11. ఆ యాత్మ అగ్నిలాంటిది. కనుకనే పెంతెకోస్తు దినాన అగ్నిలా దిగివచ్చింది. "అగ్నిజ్వాలలు నాలుకల్లా వ్యాపించి అక్కడవున్న ఒక్కొక్కరిపై నిల్చాయి" - అ, చ, 1,3. ఆ యాత్మ జ్ఞానస్నాన సమయంలో మనలోనికి ప్రవేశించింది మొదలు మనలను దహించి శుద్ధిచేస్తూనే వుంటుంది. కాని ఈ దహనక్రియ మన మరణ సమయంలో ఎక్కుమోతుంది. ఆ చివరిక్షణంలో మనలోని వవిత్రాత్మ మహాజ్వాలయైు మన హృదయంలోని ప్రతిపాపపుటణువునీ కాల్చి పునీతం చేస్తుంది. ఇదే ఉత్తరించే స్థలం.
    ఈలా ఆత్మ మన పాపపటాత్మను దహించి పునీతం చేస్తూంటే మనకు ఆనందమూ బాధా రెండూ కలుగుతాయి, ఈ సందర్భంలో భక్తురాలు జెనొవా కత్తరీనమ్మ ఈలా నుడివింది. "దేవుని అగ్ని మన హృదయంలోనికి ప్రవేశిస్తూంటే మనలోని పాపపు త్రుప్ప దానికి అడ్డుపడుతూంటుంది. కాని ఆ దివ్యాగ్ని తనకు అదుపడే తుప్పనంతటినీ కాల్చివేస్తుంది. ఆ తపు కరిగిపోయేకొద్దీ మన ఆత్మ దేవుణ్ణి అధికాధికంగా స్వీకరిస్తుంది. దీనివల్ల మన ఆనందం పెరిగిపోతుంది".
       పాపాభిలాషా పవిత్రాత్మారెండూ పరస్పర విరోధ శక్తులుగా మన హృదయంలో వసిస్తూంటాయని చెప్పాం. పాపాభిలాష మనకు దుఃఖాన్ని కలిగిస్తూంటే ఆత్మ మనకు ఆనందాన్ని కలిగిస్తూంటుంది. మృత్యుకాలంలో ఆత్మ ఈ పాపాభిలాషను పూర్తిగా కాల్చి