పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాశం చేస్తుంది. ఇదే ఉత్తరించే స్థలం. ఈలా మనలోని పాపాభిలాషంతా భస్మమైపోయాక మనకు పూర్ణానందం కలుగుతుంది. దీనితో మనమనుభవించే ఉత్తరించే స్థలం అంతమౌతుంది. మనం దైవదర్శనానికి సిద్ధమౌతాం. అనగా మనం శుద్దీకరణ స్థలాన్ని దాటి మోక్షాన్ని ప్రవేశించడానికి పాత్రులమౌతాం. ఈ భాగ్యం మనకు ఉత్థాన క్రీస్తువల్లా అతని ఆత్మవల్లాకూడ సిద్ధిస్తుంది. మన రక్షణ ఘట్టాలన్నిటిలోనూ క్రీస్తూ, శీర్షికఫార్మాటుబిందుఅతని ఆత్మా యిద్దరూ కలసే పని చేస్తారు. కాని క్రీస్తూ ఆత్మా మనలను శుద్ధిచేయడానికి ఎంతోకాలం పట్టదు. మన మరణ సమయంలో ఒక్క నిమిషంలోనే ఈ కార్యం జరిగిపోతుంది.

4. మన ప్రార్థనలు ఆలస్యం కావా?

ఉత్తరించే స్థలంలోని ఆత్మలు ఒక్క నిమిషంలోనే శుద్ధిని పొందుతాయని చెప్పాం. మరి మనం ఏటేట చనిపోయిన వాళ్ళకొరకు ప్రార్థనలర్పించడంలో భావం ఏమిటి? మన ప్రార్థనలు ఆలస్యం కావా? చనిపోయినవాల్లు అంతకు పూర్వమే మోక్షానికి వెళ్ళివుండరా?

నరులమైన మనకు భూతం, వర్తమానం, భవిష్యత్తు అని మూడుకాలాలుంటాయి. దేవుడికి ఈలా త్రికాలాలు ఉండవు, అతనికి అంతా వర్తమానమే, అన్ని కాలాల్లోని సంఘటనలూ అతనికి వర్తమానంలో కండ్లయెదుట జరుగుతూన్నట్లే కన్పిస్తాయి. "దేవుని దృష్టిలో ఒక దినమనిగాని వేయి సంవత్సరాలనిగాని తేడాలేదు. ఆయనకు రెండూ సరిసమానమే" - 2షేత్రు 3,8. కనుక మనం నరులు చనిపోకముందు ప్రార్ధించినా, చనిపోయేప్పడు ప్రార్ధించినా, చనిపోయిన తర్వాత ప్రార్ధించినా అతనికి అంతా సరిసమానమే ఔతుంది. ఆ ప్రార్థనలన్నీ అతనికి వర్తమాన ప్రార్థనలే ఔతాయి. మనం భూత భవిష్యద్వర్తమానకాలాల్లో చేసే క్రియలన్నీ అతని వర్తమానంలోకి ప్రవేశిస్తాయి. కనుక మనం ఎప్పడు ప్రార్థనలు చేసినా దేవుడు వాటి నంగీకరించి ఉత్తరించే ఆత్మలను శుద్ధిచేస్తాడు

ఈ సత్యాన్ని అర్థంచేసికోవడానికి ఓ వుపమానం చూద్దాం. రాబోయే క్రీస్తు సిలువ మరణం ఫలితాలనుచూచి దేవుడు మరియను జన్మపాపరహితనుగా పుట్టించాడు. మరియ పట్టాక షుమారు యాభై యేండ్లకుగాని క్రీస్తు సిలువ మరణాన్ని అనుభవింపలేదు. ఐనా దేవుని దృష్టిలో మరియు పట్టవూ క్రీస్తు సిలువ మరణమూ అనే రెండు సంఘటనలు ఏకమయ్యాయి, ఆ రెండూ అతని వర్తమానంలోకి ప్రవేశించాయి. క్రీస్తు సిలువ మరణం యాబైయేండ్లు వెనక్కు జరిగి అతని తల్లిని నిష్కల్మషనుగా పుట్టించింది మన ప్రార్థనలు