పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ ప్రభువు మన ఆశ, మన నమ్మకం. ఒక్కమరణ సమయంలోనేగాదు, రోజువారి జీవితంలో గూడ మనం క్రీస్తుతో చనిపోయి అతనితో ఉత్థాన మౌతుండాలి. ప్రతిదినమూ అతని సిలువా మహిమా మన జీవితంలో ప్రత్యక్షమౌతుండాలి. కాననే పౌలు క్రీస్తుశ్రమల్లో పాల్గొని అతని ఉత్థానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలని కోరుకొన్నాడు - ఫిలి 3,10-11.

3.మనం రాబోయే మృత్యువుని గూర్చి భయపడ్డంకంటె ఆ మృత్యువుని కలిసికోవడానికి ఇప్పటినుండే సిద్ధం కావడం మంచిది. నరులు ఏలా జీవిస్తారో అలాగే చనిపోతారు. ఈయిహలోక జీవితం పరీక్షాసమయం. ఇది కోతకాలం. ఇక్కడ మంచిజీవితమనే పంటను పండించుకొనేవాళ్లు పరలోకానికి ధాన్యం చేకూర్చిపెట్టుకొంటారు. పైగా మనం ఇక్కడ కొన్నియేండ్లు మాత్రమే జీవిస్తాం. ఈ లోకంగుండ ఒక్కసారి మాత్రమే సాగిపోతాం. కనుక దేవుడు మనకు దయచేసిన యీ హ్రస్వకాలాన్ని సద్వినియోగం చేసికోవాలి. సత్ర్కియలతో ఈలోక జీవితాన్నిసార్థకం జేసికోవాలి. ఈలా చేసినవాడు కొలది యేండ్లు జీవించినా పెక్కేండ్లు జీవించినవా డవుతాడు.

4.తరచుగా మృత్యువునిగూర్చి ధ్యానం చేసికోవడంగూడ మంచిది. చాలమంది పునీతులు ఈలాచేసారు. మృత్యుమననంవల్ల లోక వ్యామోహాలనుండి వైదొలగుతాం. పారమార్ధిక ధృష్టినలవర్చుకొంటాం. పాపాలకు పశ్చాత్తాపపడతాం. పుణ్యకార్యాలకు పూనుకొంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే, వళ్ళు దగ్గర పెట్టుకొని జీవిస్తాం. ఇది అల్పభాగ్యమేమీ కాదు.

2. తీర్పు

       భగవంతుడు నరులందరికీ ఓదినం ఖండితంగా తీర్పు తీరుస్తాడు. కనుక మనం

ధర్మబద్ధంగా జీవించాలి. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.

1. తీర్పు అంటే యేమిటి?

     మనం చనిపోగానే మన ఆత్మదేవుణ్ణి  చేరుకొంటుంది. భగవంతుడు దానికి

తీర్పు తీరుస్తాడు. మన తలపులకీ మాటలకీ చేతలకీ, చేయవలసిగూడ చేయకుండా వదలివేసిన పనులకీ మనం భగవంతునికి ఖండితమై లెక్క ఒప్పచెప్పాలి.

     ఒక్క క్రైస్తవ యూదమతాల్లోనేగాక ప్రపంచంలోని ముఖ్య మతాలన్నిటిలోగూడ

'భగవంతుడు న్యాయాధిపతి, అతడు నరులందరికీ న్యాయనిర్ణయం చేస్తాడు అనే భావం