పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39. లూకా సువిశేషము 16–24

1."కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను" ఎవరి వ్రణములు?
2. వ్యాధి నయమయిన పదిమంది కుష్టరోగులతో తిరిగి వచ్చి ప్రభువుకి వందనములు చెప్పినవాడు ఏ జాతి వాడు? 3.ప్రార్థన చేయుటకై ఇద్దరు దేవాలయమునకు వెళ్లిరి. ఆ యిద్దరు ఎవరు?
4.తల్లలు పసిబిడ్డలను క్రీస్తు దగ్గరికి తీసికొని రాబోగా ఎవరు అడ్డు వచ్చిరి?
5.క్రీస్తు నీ యాస్తినమ్మి పేదలకు దానము చేయమనగా బాధపడి వెళ్ళి పోయినవా వడు?
6.జక్కయ వృత్తి యేమిటి?
7. యేసు గమనించుచుండిన పేద వితంతువు కానుకల పెట్టెలో ఎంత సౌమ్మ వేసెను?
8.సిలువపైనున్న క్రీస్తుకు సైనికులు ఏమి త్రాగనిచ్చిరి?
9. ఎమ్మావనకు వెళ్ళిన యిద్దరు శిష్యులలో ఒకని పేరేమి?
10. ఉత్తానక్రీస్తు ఏ నగరము సమీపమున మోక్షారోహణము చేసెను?

40. యోహాను సువిశేషము 1-6

1.యోహాను సువిశేషములో మొదటివాక్యమేది?
2. క్రీస్తు పాదరక్షల వారును విప్పటకైనను యోగ్యుడను కానని చెప్పిన దెవరు?
3. క్రీస్తు ఏ శిష్యుని అంజూరపు చెట్టుక్రింద నుండగా చూచెను?
4. మరల జన్మించిననేతప్ప నరుడు దేవుని రాజ్యమును చూడజాలడని క్రీస్తు ఎవరితో చెప్పెను?
5. యాకోబు బావి ఏ పట్టణమవద్ద నున్నది?
6.క్రీస్తు ఒక స్త్రీతో మాటలాడుటనుచూచి ఆశ్చర్యపడిన దెవరు?
7.మొదట తనలోనికి దిగినవాని వ్యాధిని నయము చేయు కోనేరు పేరేమిటి?
8. క్రీస్తు ఎన్ని రొట్టెలు ఎన్నిచేపలు తీసికొని ఐదువేల మందికి ఆహారము పెట్టెను?
9. పితరులు ఎడారిలో దేనిని భుజించిరి?
10."మేము ఎవరియొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు" అని క్రీస్తుతో చెప్పినదెవరు